Breaking News

2031 నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్‌!

Published on Thu, 03/07/2024 - 05:57

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.8 శాతంగా క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అలాగే 2031 నాటికి దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థాయికి రెట్టింపై దాదాపు 7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని.. తద్వారా ఎగువ మధ్య–ఆదాయ దేశంగా మారుతుందని క్రిసిల్‌ ఇండియా అవుట్‌లుక్‌ నివేదిక పేర్కొంది.

నిర్మాణాత్మక సంస్కరణలు తదితర సానుకూల ఆర్థిక నిర్ణయాల వల్ల దేశ ఎకానమీ 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపింది. రానున్న ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2024–25 నుంచి 2030–31) భారత్‌ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయిని దాటి 7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. ఈ కాలంలో ఎకానమీ సగటును 6.7 శాతం పురోగమిస్తుందని అభిప్రాయపడింది.    

ప్రస్తుతం ఐదవ స్థానంలో..
25.5 ట్రిలియన్‌ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎనానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్‌ (4.2 ట్రిలియన్‌ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్‌ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్‌ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు  ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.6 ట్రిలియన్‌ డాలర్లు.  

4,500 డాలర్లకు తలసరి ఆదాయం..
2031 ఆర్థిక సంవత్సరం భారత్‌ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరుగుతుంది. దీనితో దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్‌లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకా రం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డా లర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పే ర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. 

తయారీ, సేవల రంగాల్లో మంచి అవకాశాలు...
దేశీయ, ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా తయారీ– సేవల రంగాలు  రెండింటికీ పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. 2025–2031 ఆర్థిక సంవత్సరాల మధ్య తయారీ– సేవల రంగాలు వరుసగా 9.1 శాతం, 6.9 శాతం  చొప్పున వృద్ధి చెందుతుందని మేము అంచనా వేస్తున్నాము. తయారీ రంగం ద్వారా కొంత పెరుగుదల ఉన్నప్పటికీ, సేవా రంగం భారతదేశ వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తుంది.    
 – ధర్మకీర్తి జోషి, క్రిసిల్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు