భారత దివాలా చట్టం భేష్‌ 

Published on Thu, 12/04/2025 - 06:33

న్యూఢిల్లీ: భారత్‌ దివాలా పరిష్కార చట్టానికి (ఐబీసీ) ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ కితాబిచి్చంది. అధికారిక ర్యాంకింగ్‌ మదింపును సవరించింది. దివాలా పరిష్కార కార్యాచరణ రుణదాతలకు స్నేహపూర్వకంగా ఉండడాన్ని గుర్తించింది. భారత్‌లో దివాలా అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) రుణ క్రమశిక్షణను బలోపేతం చేసిందని, పరిష్కార ప్రక్రియను రుణదాతలకు అనుకూలంగా మార్చిందని ఎస్‌అండ్‌పీ తన నివేదికలో పేర్కొంది. గతంలో దివాలా పరిష్కార విధానాలకు భిన్నంగా ఐబీసీ కింద సంక్షోభంలోని కంపెనీల ప్రమోటర్లు తమ వ్యాపారాలపై నియంత్రణ కోల్పోతున్నట్టు వివరించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత దివాలా పరిష్కార చట్టానికి అధికారిక ర్యాంకింగ్‌ మదింపును గ్రూప్‌–సి నుంచి గ్రూప్‌–బికి మారుస్తున్నట్టు ప్రకటించింది.

 రుణదాతలకు స్నేహపూర్వకంగా ఉన్న దివాలా పరిష్కార ప్రక్రియను బలహీనం నుంచి మధ్యస్థానికి మెరుగుపరిచిన నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలిపింది. ఐబీసీ కింద రుణదాతల ఆధ్వర్యంలో విజయవంతమైన పరిష్కారాలను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది. రుణాల వసూళ్లు, రికవరీ రేటు మెరుగుపడ్డాయని.. సగటు రుణ వసూలు గత చట్టం కింద ఉన్న 15–20 శాతం నుంచి ఐబీసీ కింద 30 శాతానికి పెరిగినట్టు తెలిపింది. గతంలో ఒక్కో కేసు పరిష్కారానికి ఆరు నుంచి ఎనిమిదేళ్ల సమయం తీసుకోగా, ఐబీసీ కింద రెండేళ్లకు తగ్గినట్టు ఎస్‌అండ్‌పీ పేర్కొంది. అధికార ర్యాంకింగ్‌ మదింపు అన్నది.. ఒక దేశ దివాలా చట్టం కింద రుణదాతలకు ఉన్న భద్రతను సూచిస్తుంటుంది.  

Videos

రెపో రేటును తగ్గించిన RBI

భవానీపురం ప్లాట్ల బాధితులకు అండగా వైఎస్ జగన్

ఏడీకి 100 కోట్ల ఆస్తులు.. ఏసీబీ అరెస్ట్

జగన్ అనే వ్యక్తి లేకపోతే ఏపీ ఖేల్ ఖతం..

అఖండ-2 రిలీజ్ వాయిదా.. మద్రాస్ హైకోర్టు స్టే

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి జనం పరుగులు

ఒకటేసారి పుట్టి.. ఒకే చోట చదివి.. ఒకటే శాఖల జాబ్ కొట్టిండ్రు

ఫుల్లుగా తాగి.. యువతిని లాక్కెళ్లి మానభంగం

అయిందా.. బాగా అయిందా.. ఎందుకు ఈ ఎగస్ట్రాలు

కారు పైకి ఎక్కి హంగామా చేసావే.. ఇప్పుడు ఎందుకు నోరు మూసుకొని ఉన్నావ్

Photos

+5

హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

విశాఖ : వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు (ఫొటోలు)

+5

విశాఖ చేరుకున్న భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్‌ సందడి (ఫొటోలు)

+5

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి..వైభవంగా కలశజ్యోతుల ఉత్సవం (ఫొటోలు)

+5

భారత్‌లో పుతిన్‌ (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో సమంత ఫ్రెండ్‌ శిల్పా రెడ్డి అందాలు (ఫోటోలు)

+5

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫోటోలు)

+5

దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్‌ మృతి.. ప్రముఖుల నివాళులు (ఫోటోలు)

+5

చలికాలం స్వింగ్‌లో పూజా హెగ్డే.. స్పెషల్‌ ఫోటోలు చూశారా..?