భారత్‌ ఎకానమీకి ‘వినియోగం’ రక్ష

Published on Thu, 06/29/2023 - 05:10

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2026–27 ఆర్థిక సంవత్సరం వరకూ సగటున 6.7 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– ఎస్‌అండ్‌పీ సీనియర్‌ ఎకనమిస్ట్‌ (ఆసియా–పసిఫిక్‌) విశ్రుత్‌ రాణా అంచనావేశారు. దేశీయ వినియోగమే ఎకానమీ పురోగతికి ప్రధాన కారణంగా ఉంటుందని ఆయన విశ్లేషించారు. 2022–23లో ఎకానమీ వృద్ధి రేటు 7.2 శాతంకాగా, ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6 శాతంగా ఉంటుందని ఒక వెబినార్‌లో పేర్కొన్నారు.

ఎగుమతుల పరంగా ఎదురవుతున్న సవాళ్లు వృద్ధి రేటుకు కొంత ప్రతికూలంగా ఉన్నాయని అన్నారు. వడ్డీరేట్ల పెంపు, వినియోగ డిమాండ్‌పై ఈ ప్రతికూలతలు తక్షణం ఎకానమీ బలహీనతకు కారణంగా పేర్కొన్నారు. 2022–23 వృద్ధికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 6.5  అంచనాలకన్నా విశ్రుత్‌ రాణా అంచనా (6 శాతం) తక్కువగా ఉండడం గమనార్హం. కాగా పెట్టుబడుల పరంగా చూస్తే దేశీయ రికవరీ పటిష్టంగా ఉందని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్నప్పటికీ,  వడ్డీరేట్లను తగ్గించేందుకు ఆర్‌బీఐ తొందరపడబోదన్నది తమ అభిప్రాయమన్నారు. ద్రవ్యోల్బణం అంచనాలు పూర్తిగా తగ్గే వరకు ఆర్‌బీఐ నిరీక్షిస్తుందని,  రేట్లను తగ్గించడానికి 2024 ప్రారంభం వరకు వేచి ఉండవచ్చని రాణా అభిప్రాయపడ్డారు.   

Videos

ఢిల్లీలో YSR అవార్డ్స్-2026 ప్రదానోత్సవం

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

ఈ విషయాలు మీకు తెలుసా.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ

Magazine Story About ChandraBabu Cunning Plans

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)