Breaking News

ఆటో మొబైల్‌... ఎగుమతులు ఆకర్షణీయం

Published on Sun, 07/27/2025 - 04:53

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ ఎగుమతులు జూన్‌ త్రైమాసికంలో ఆకర్షణీయంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 22 శాతం పెరిగాయి. మొత్తం 14,57,461 యూనిట్లు ఎగుమతి అయినట్టు ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య (సియామ్‌) ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 11,92,566 యూనిట్లుగా ఉన్నాయి. ప్రధానంగా ప్యాసింజర్‌ వాహనాలు, ద్విచక్ర, వాణిజ్య వాహన ఎగుమతులు అధికంగా జరిగాయి. 

ప్యాసింజర్‌ వాహన ఎగుమతులు 2,04,330 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 1,80,483 యూనిట్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి. మారుతి సుజుకీ 96,181 యూనిట్ల ప్యాసింజర్‌ వాహనాలను క్యూ1లో ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని ఎగుమతులు 69,962 యూనిట్ల కంటే 37 శాతం ఎక్కువ. గత నాలుగేళ్ల నుంచి ప్యాసింజర్‌ వాహన ఎగుమతుల్లో మారుతి సుజుకీ అగ్రస్థానంలో ఉంటున్నట్టు సంస్థ సీఈవో (కార్పొరేట్‌ అఫైర్స్‌) రాహుల్‌ భారతి తెలిపారు. క్యూ1లో తమ వాటా 47 శాతానికి చేరుకున్నట్టు చెప్పారు.

 మారుతి తర్వాత హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా అత్యధికంగా 48,140 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 13 శాతం అధికం. ద్విచక్ర వాహన ఎగుమతులు 11,36,942 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో ద్విచక్ర వాహన ఎగుమతులు 9,23,148 యూనిట్ల కంటే 23 శాతం పెరిగాయి. వాణిజ్య వాహన ఎగుమతులు సైతం 23 శాతం పెరిగి 19,427 యనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహన అమ్మకాలు 34 శాతం పెరిగి 95,796 యూనిట్లకు చేరాయి.   
 

Videos

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)