Breaking News

భారత నిపుణుల్లో ఏఐ పట్ల మక్కువ

Published on Fri, 08/25/2023 - 03:48

న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌/ఏఐ)కు ప్రాధాన్యం పెరగడంతో, భారత నిపుణులు ఈ నైపుణ్యాలను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏఐ నైపుణ్యాలు కలిగిన వారి సంఖ్య 2016 జనవరి తర్వాత 14 రెట్లు పెరిగినట్టు ప్రొఫెషనల్‌ సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ ‘లింక్డిన్‌’ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దీంతో ఏఐ నైపుణ్యాల పరంగా టాప్‌–5 దేశాల్లో సింగపూర్, ఫిన్లాండ్, ఐర్లాండ్, కెనడాతోపాటు భారత్‌ ఒకటిగా ఉందని తెలిపింది.
 
2016 జనవరి నాటికి నిపుణుల ప్రొఫైల్స్, తాజా ప్రొఫైల్స్‌ను లింక్డెన్‌ విశ్లేషించింది. కనీసం రెండు రకాల ఏఐ నైపుణ్యాలు పెరిగిన ప్రొఫైల్స్‌ను పరిగణనలోకి తీసుకుంది. ‘‘గడిచిన ఏడాది కాలంలో పని ప్రదేశాల్లో ఏఐ వినియోగం పెరిగింది. దీంతో ఏఐ నైపుణ్యాలను సొంతం చేసుకుంటే కెరీర్‌ అవకాశాలు మరింత మెరుగుపడతాయని భారత్‌లో 60 శాతం మంది ఉద్యోగులు, 71 శాతం జనరేషన్‌ జెడ్‌ నిపుణులు గుర్తించారు’’అని లింక్డిన్‌ తెలిపింది.  

ఏఐ, ఎంఎల్‌కు ప్రాధాన్యం
ప్రతి ముగ్గురిలో ఇద్దరు 2023లో కనీసం ఒక డిజిటల్‌ స్కిల్‌ నేర్చుకుంటామని లింక్డ్‌ఇన్‌ నిర్వహించిన సర్వేలో చెప్పారు. ముఖ్యంగా ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్న నైపుణ్యాల్లో అగ్రభాగాన ఉన్నా యి. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సైతం ఏఐ నైపుణ్యాలపై శిక్షణ, నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే ఏడాది తమ సంస్థల్లో ఏఐ వినియోగాన్ని పెంచే ప్రణాళికతో 57 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు.

మార్పులు స్వీకరించే విధంగా తమ ఉద్యోగులకు తిరిగి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి కంపెనీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ‘‘భవిష్యత్‌ పనితీరు విధానాన్ని ఏఐ మార్చనుంది. భవిష్యత్‌కు అనుగుణంగా ప్రపంచస్థాయి మానవ వనరుల అభివృద్ధికి వీలుగా నైపుణ్యాల ప్రాధాన్యం, ఉద్యోగుల సామర్థ్యాలను భారత్‌ గుర్తించింది’’అని లింక్డిన్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ అశుతోష్‌ గుప్తా తెలిపారు. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)