Breaking News

ఛాట్‌జీపీటీకి పోటీగా మన ‘హనూమాన్‌’!

Published on Wed, 02/21/2024 - 15:35

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న వేళ భారత్ కూడా దీనికి పోటీగా.. అలాంటి సేవలని అందించాలనే ఉద్దేశ్యంగా అంబానీకి చెందిన రిలయన్స్, ఇతర ఐఐటీల సమన్వయంతో ఏర్పాటైన 'భారత్ జీపీటీ' వచ్చే నెలలో కొత్త ఏఐ మోడల్ లాంచ్ చేయడానికి సంకల్పించింది.

భారత్ జీపీటీ లాంచ్ చేయనున్న ఏఐ మోడల్​కు 'హనూమాన్‌' (Hanooman) అని నామకరణం చేశారు. ఈ హనుమాన్ ఏఐ మోడల్ మొత్తం 11 భాషల్లో సేవలను అందించనున్నట్లు సమాచారం. ఇందులో విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, పరిపాలన రంగాలకు చెందినవి ఉంటాయి.

ఇప్పటికే భారత్ జీపీటీ హనూమాన్‌ ఏఐ మోడల్ పనితీరును తెలియజేసే వీడియోను ప్రదర్శించింది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా స్పీచ్​ టు టెక్ట్స్ కూడా​ జనరేట్ చేయవచ్చని సమాచారం. భారతీయుల అవసరాలకు అనుగుణంగా ఈ హనుమాన్ ఏఐ మోడల్‌ను డెవలప్ చేస్తున్నట్లు రిలయన్స్ వెల్లడించింది.

రిలయన్స్ కంపెనీ ఇప్పటికే తమ సబ్‌స్క్రైబర్లకు ఏఐ సేవలను అందించేందుకు 'జియో బ్రెయిన్‌' పేరిట ఓ మోడల్‌ను తయారు చేస్తోంది. మరోవైపు ఇండియన్ యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సర్వం, కృత్రిమ్ వంటి సంస్థలు కూడా ఏఐ మోడల్స్ అభివృద్ధి చేస్తున్నాయి.

ఇదీ చదవండి: మొన్న వార్నింగ్.. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ - టెక్ దిగ్గజం కొత్త వ్యూహం!

ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాట్​జీపీటీ, జెమినీ ఏఐ, ఏఐ గ్రోక్ వంటివి పుట్టుకొస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ఇలాంటి టెక్నాలజీల అభివృద్ధికి సన్నద్ధమయ్యే అవకాశం ఉంది, ఇదే జరిగితే మరిన్ని ఏఐ మోడల్స్ పుట్టుకొస్తాయని పలువురు చెబుతున్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)