Breaking News

ఏఐ మార్కెట్‌ @ 17 బిలియన్‌ డాలర్లు

Published on Fri, 06/13/2025 - 04:37

న్యూఢిల్లీ: దేశీ కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్‌ 2027 కల్లా ప్రస్తుత స్థాయి నుంచి మూడు రెట్లు వృద్ధి చెందనుంది. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏఐ ఎకానమీల్లో ఒకటిగా భారత్‌ను నిలబెడుతూ 17 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరనుంది. ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీలో పెట్టుబడులు పెరుగుతుండటం, డిజిటల్‌ వ్యవస్థ వృద్ధి చెందుతుండటం, నిపుణులైన ప్రొఫెషనల్స్‌ లభ్యత తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి.

 బోస్టన్‌ కన్సలి్టంగ్‌ గ్రూప్‌ (బీసీజీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రపంచ ఏఐ టాలెంట్‌లో 16 శాతం మంది భారత్‌లో ఉన్నారు. దేశీ ఏఐ వ్యవస్థలో 6,00,000 మంది పైగా ఏఐ ప్రొఫెషనల్స్, 70 కోట్ల మంది ఇంటర్నెట్‌ యూజర్లు ఉన్నారు. గత మూడేళ్లలో 2,000 పైగా ఏఐ స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయి.  

డిజిటల్‌ ఇన్‌ఫ్రా దన్ను.. 
ఆధార్, యూపీఐ, డిజిలాకర్, ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ)లాంటి డిజిటల్‌ మౌలిక సదుపాయాలు దేశీయంగా వివిధ రంగాలను ఏఐతో అనుసంధానించేందుకు సహాయకరంగా ఉంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఇంటర్నెట్‌ యూజర్లు, విస్తృతంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం కారణంగా భారత్‌లో భారీ స్థాయిలో డేటా జనరేట్‌ కావడం ఏఐ మోడల్స్‌ శిక్షణకు ఉపయోగకరంగా ఉంటోంది. ఇక ప్రస్తుతమున్న 152 డేటా సెంటర్ల నెట్‌వర్క్‌కు అదనంగా 2025లో భారత్‌లో కొత్తగా 45 సెంటర్లు రానున్నాయి. 

రూ. 10,000 కోట్లతో ప్రభుత్వం ప్రకటించిన ఇండియాఏఐ మిషన్‌ జాతీయ స్థాయిలో ఏఐ కంప్యూట్‌ మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుంది. దీనితో ఏఐ మోడల్‌ శిక్షణ, పరిశోధన కోసం 10,000 పైగా జీపీయూలు (గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు) అందుబాటులోకి వస్తాయి. ‘ఏఐ అనేది వ్యాపార సంస్థలకు ఒక ఆప్షన్‌గా కాకుండా అవసరంగా మారింది. భారతీయ కంపెనీలు అంతర్జాతీయంగా కూడా మరింత ధీమాగా పోటీపడగలుగుతున్నాయి. టెక్నాలజీ వినియోగం మాత్రమే కాకుండా మార్పులను సమర్ధవంతంగా ఎదుర్కొనడం, అంతర్గత వ్యవస్థలో ఏఐని వినియోగించుకోవడం వంటి అంశాలే అగ్రగామి కంపెనీలకు మిగతా సంస్థలకు మధ్య వ్యత్యాసాన్ని నిర్దేశిస్తాయని బీసీజీ ఇండియా ఎండీ మన్‌దీప్‌ కోహ్లి తెలిపారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)