ఎగుమతులు ఢమాల్‌!

Published on Wed, 09/18/2024 - 04:13

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి  భారత్‌ వస్తు ఎగుమతులపై ప్రభావం చూపింది. ఆగస్టులో ఎగుమతులు గడచిన 13 నెలల్లో ఎన్నడూ లేని స్థాయిలో 9.3 శాతం క్షీణించి (2023 ఆగస్టు నెలతో పోల్చి) 34.71 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. జూలైలో కూడా ఎగుమతుల విలువ పడిపోయినప్పటికీ అది కేవలం 1.5 శాతంగా ఉండడం గమనార్హం.  

దిగుమతులు రికార్డు... 
ఇక దిగుమతులుసైతం రికార్డు స్థాయిలో 3.3 శాతం పెరిగి 64.36 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసం – వాణిజ్యలోటు 10 నెలల గరిష్ట స్థాయిలో 29.65 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.  

బంగారం, వెండి ప్రభావం.. 
బంగారం, వెండి దిగుమతులు భారీగా పెరగడం తీవ్ర స్థాయి వాణిజ్యలోటుకు ఒక కారణం. 2023 ఆగస్టులో బంగారం దిగుమతులు 4.93 బిలియన్‌ డాలర్లుకాగా, 
ఈ ఆగస్టులో రెట్టింపై 10.06 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వెండి దిగుమతులుసైతం ఇదే సమయంలో 159 మిలియన్‌ డాలర్ల నుంచి 727  మిలియన్‌ డాలర్లకు ఎగశాయి. బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్‌ సుంకాలను  (15% నుంచి 6%కి) తగ్గించడం, పండుగ సీజన్‌ డిమాండ్‌ దిగుమతులు భారీగా పెరగడానికి కారణం. కాగా, ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య వస్తు ఎగుమతుల విలువ 1.14% పెరిగి 178.68 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)