పెరిగిన బంగారం, వెండి దిగుమతులు

Published on Thu, 10/16/2025 - 11:38

అంతర్జాతీయంగా వాణిజ్య అనిషితుల్లోనూ దేశ ఎగుమతుల రంగం పనిష్ట పనితీరు చూపించింది. సెప్టెంబర్‌లో ఎగుమతులు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 6.74 శాతం అధికంగా 36.38 బిలియన్‌ డాలర్ల (3.20 లక్షల కోట్లు) విలువ మేర ఎగుమతులు జరిగాయి. దిగుమతులు సైతం 16.6 శాతం పెరిగి 68.53 బిలియన్‌ డాలర్లు(రూ.6.03 లక్షల కోట్లు)గా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు సెప్టెంబర్‌ నెలకు మరింత విస్తరించి 31.15 బిలియన్‌ డాలర్లు(రూ.2.74 లక్షల కోట్లు)గా నమోదైంది. 2024 సెప్టెంబర్ నెలలో దిగుమతులు 58.74 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. కేంద్ర వాణిజ్య శాఖ ఈ వివరాలను విడుదల చేసింది.

ప్రధానంగా బంగారం, వెండి, ఎరువుల దిగుమతులు పెరిగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు) ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 3 శాతం పెరిగి 220 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 4.53 శాతం పెరిగి 375.11 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు 155 బిలియన్‌ డాలర్లకు విస్తరించింది.

అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న తరుణంలోనూ భారత వస్తు, సేవల ఎగుమతులు మంచి పనితీరు చూపించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. మెరుగైన పనితీరుకు కారణం ఏంటన్న మీడియా ప్రశ్నకు దేశీ పరిశ్రమ బలంగా ఉందంటూ.. తమ సరఫరా వ్యవస్థలను, వ్యాపార సంబంధాలను మెరుగ్గా కొనసాగించినట్టు చెప్పారు. అమెరికా 50 శాతం టారిఫ్‌ల ప్రభావంపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. దీన్ని తెలుసుకునేందుకు కమోడిటీ వారీగా డేటాను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అమెరికాకు మొత్తం ఎగుమతుల్లో 45 శాతానికి టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)