Breaking News

హైదరాబాద్‌లో ఆఫీస్‌ అద్దెలు జంప్‌

Published on Tue, 05/27/2025 - 11:12

హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్లో అద్దె ఆదాయం గత మూడేళ్లలో 24 శాతం పెరిగినట్టు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ వెల్లడించింది. చదరపు అడుగు నెలవారీ అద్దె ధర 2022లో రూ.58గా ఉంటే.. అది 2025 నాటికి రూ.72కు పెరిగింది. అత్యధికంగా ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో (ఎంఎంఆర్‌) చదరపు అడుగుకు అద్దె రూ.131 నుంచి రూ.168కి చేరింది. 2022 నుంచి 2025 మధ్య కాలంలో (కరోనా అనంతరం) ప్రీమియం ఆఫీసు వసతులకు డిమాండ్‌ స్థిరంగా వృద్ధి చెందినట్టు.. ముఖ్యంగా ఎంఎంఆర్, ఢిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్‌ కీలక కేంద్రాలుగా ఉన్నట్టు అనరాక్‌ నివేదిక తెలిపింది. అన్ని మెట్రోల్లోనూ అద్దె ధరల్లో మంచి వృద్ది నమోదైనట్టు పేర్కొంది.  

  • ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఆఫీస్‌ వసతుల అద్దె చదరపు అడుగునకు రూ.92 నుంచి రూ.110కి పెరిగింది. 20 శాతం వృద్ధి నమోదైంది.  

  • బెంగళూరులో నెలవారీ అద్దె చదరపు అడుగునకు రూ.16% పెరిగి రూ.82 నుంచి రూ.95కి చేరింది.

  • పుణెలో 11 శాతం పెరుగుదలతో రూ.80కి, చెన్నైలో 9.1 శాతం పెరిగి రూ.72కు చదరపు అడుగు అద్దె చేరుకుంది.  

ఇదీ చదవండి: పీసీలకు పెరిగిన గిరాకీ

యూఎస్‌ కంపెనీల నుంచి అధిక డిమాండ్‌ 

గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ లీజింగ్‌లో 45 శాతం యూఎస్‌ కంపెనీల నుంచే ఉన్నట్టు అనరాక్‌ గ్రూప్‌ కమర్షియల్‌ లీజింగ్‌ ఎండీ పీయూష్‌ జైన్‌ తెలిపారు. ముంబైలో బీఎఫ్‌ఎస్‌ఐ ఆఫీస్‌ లీజింగ్‌లో 48 శాతం యూఎస్‌కు చెందిన బ్యాంక్‌లు లీజింగ్‌కు తీసుకున్నట్టు చెప్పారు. భారత్‌లో గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ వసతులకు అమెరికన్‌ కంపెనీల నుంచి బలమైన డిమాండ్‌ ఉన్నట్టు తెలిపారు.
 

#

Tags : 1

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)