Breaking News

మూలధన ఆస్తుల ‘బదిలీ’ లీలలు

Published on Mon, 09/14/2026 - 09:13

గత వారం మూలధన ఆస్తి అంటే ఏమిటో తెలుసుకున్నాం. నిర్వచనం, పరిధి, మినహాయింపులు ఏమిటో తెలుసుకున్నాం. అలా తెలుసుకున్న మూలధన ఆస్తిని ఏం చేస్తే పన్ను భారం ఏర్పడుతుందో తెలుసుకుందాం. మూలధన ఆస్తి బదిలీ చేయగా లాభం ఏర్పడితే, ఆ లాభాలను మూలధన లాభాలు అంటారు. ఈ ఆదాయం స్వభావరీత్యా పన్నుకి గురయ్యే ఆదాయం. మినహాయింపులు చాలా ఉన్నాయనుకోండి.

నిర్వచనంలోకి వెళ్తే సెక్షన్‌ 2(47)లో బదిలీ అంటే ఏమిటో నిర్వచించారు. లేదా నిర్వచించడం చాలా కష్టమని అనిపించో ఏమో .. చాలా తెలివిగా ఒక జాబితాలో కొన్ని అంశాలను ప్రస్తావించి, ఇవన్నీ బదిలీలో భాగమే, బదిలీ కింద పరిగణిస్తారని గట్టిగా వక్కాణించారు. ‘బదిలీ’ లీలలు ఏవిటంటే..  

  • అమ్మకం

  • మార్పిడి

  • హక్కుని వదులుకొనడం

  • హక్కుని రద్దు చేసుకోవడం

  • గవర్నమెంటు వారు స్వాధీనపర్చుకోవడం

  • వ్యాపారాల్లో స్టాకుగా మార్చడం

  • జీరో కూపన్‌ బాండ్ల మెచ్యూరిటీ

  • ఆస్తి బదిలీ చట్ట ప్రకారం స్వాదీనపర్చుకోవడం

  • అనుభవించే హక్కు ఇవ్వడం

చూశారా, ఒక్క ‘బదిలీ’ అనే చిన్న పదంలో ఎన్నింటిని జతకలిపారు. ఇలాగే ఉంటాయి చట్టంలోని కొన్ని అంశాలు.అమ్మకం మీకు బాగా తెలిసిందే. రిజిస్ట్రేషన్‌ ద్వారా అమ్ముతారు. ప్రతిఫలం తీసుకుంటారు. మార్పిడి అంటే, పాతకాలపు వస్తుమార్పిడి పద్ధతి. దీన్నే బార్టర్‌ సిస్టం అని అంటారు. హైదరాబాదులో ఉన్న జాగాకి బదులుగా విశాఖపట్నం జాగా తీసుకోవడం. రిజిస్ట్రేషన్‌ కంపల్సరీ. ఇద్దరూ బదిలీ చేసినట్లే. 

  • హక్కుని వదులుకోవడం. ఒక ఆస్తిని ముగ్గురు అనుభవిస్తున్నారు. ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి తన హక్కుని వదులుకోవడానికి రూ.20,00,000 ప్రతిఫలం తీసుకుంటారు. ఇలా హక్కు వదులుకోవడం ‘బదిలీ’లోకి వస్తుంది.

  • హక్కులను రద్దు చేసుకోవడం. ఇది ముఖ్యంగా షేర్లలో జరుగుతుంది. కంపెనీ షేర్లు, డిబెంచర్లను వెనక్కి తీసుకుంటుంది. దీన్నే రిడెంప్షన్‌ అంటారు.

  • కంపల్సరీ స్వాదీనం. గవర్నమెంటు రింగ్‌రోడ్‌   లేదా బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసమో లేక ఇతరత్రా ప్రజోపయోగకర ప్రాజెక్టు కోసమో భూమిని స్వాధీనపర్చుకున్నందుకు గాను నష్టపరిహారం ఇస్తుంది.

  • వ్యాపారరీత్యా జరిగే వ్యవహారం. మీరు బంగారం కొన్నారు. కొన్నేళ్ల తర్వాత బంగారం షాప్‌ పెట్టి ఆ బంగారాన్ని ‘స్టాక్‌’ కింద మార్చారు. బదిలీ అయినట్లు లెక్క. అయితే, స్టాక్‌ని అమ్మినప్పుడే పన్ను పడుతుంది.

  • జారీ చేసిన జీరో–బాండ్లు మెచ్యూరిటీ నాడు విక్రయంగా మారి ‘బదిలీ’గా అవుతుంది.

  • ఆస్తి బదిలీ చట్టం ప్రకారం అమ్మకానికి అగ్రిమెంటు చేసుకుని.. కొంత మొత్తం అడ్వాన్సుగా పుచ్చుకుని, మిగతా మొత్తం రాని సందర్భంలో, బయ్యర్‌ ఆస్తిని స్వాదీనపర్చుకోవడం.

  • ప్రతిఫలం లేకుండా/ఉన్నా.. ఇతరులకు ఆ ఆస్తిని అనుభవించే హక్కుని ఇవ్వడాన్ని బదిలీగానే పరిగణిస్తారు.

పైవాటిలో అమ్మకం, స్వాదీనపర్చుకోవడం .. మీకు బాగా తెలిసి ఉండొచ్చు. మిగతావి తికమకలే. సందర్భాన్ని బట్టి ఉంటుంది. అటువంటి వ్యవహారాలకు కోర్టుల వరకు వెళ్లిన సందర్భాలు ఎన్నో. కోర్టు జడ్జిమెంట్లను పరిగణనలోకి తీసుకోవాలి.

ఇదీ చదవండి: పండగ షాపింగ్‌కు.. ఏ కార్డు వాడదాం?

ఏది ‘బదిలీ’ కిందికి రాదు అనేది ముఖ్యమైన మరో అంశం. ఆ జాబితా చూడండి. ఈ కింది వ్యవహారాలను ‘బదిలీ’గా పరిగణించరు. మూలధన ఆస్తి అమ్మకంగా పరిగణించరు. పన్నుండదు.

  • ఉమ్మడి కుటుంబంలో ఆస్తి పంపకం

  • వీలునామా ద్వారా సంక్రమణ

  • బహుమతులు

  • కంపెనీల్లో కొన్ని సందర్భాల్లో జరిగే ప్రక్రియ

  • గోల్డ్‌ బాండ్ల మెచ్యూరిటీ.. ఇవన్నీ ‘మూలధన ఆస్తుల’ బదిలీ లీలలు.

Videos

ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు

పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు

దుబాయ్ కి జంప్.? బయటపడ్డ NANDUS WORLD సీక్రెట్ స్కెచ్..!

ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం

కావాలని మహిళా బైకర్ ను ఢీ కొట్టిన కారు వైరల్ అవుతున్న వీడియో

యూపీలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లోనే తన్నుకున్న TDP తమ్ముళ్లు

3లక్షల అమెరికన్ డైమండ్స్ తో గణపతి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే

రఘు మాస్టర్ ని కలిశా నన్నే అన్ని చూసుకోమన్నారు

గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

Photos

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)