Breaking News

ఈ ఆర్థిక సంవత్సరంలో ‘సీనియర్‌ సిటిజన్లు’

Published on Mon, 04/20/2026 - 17:31

కొత్త చట్టం, కొత్త రూల్సు అమలులోకి వచ్చాయి. ఎన్నెన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు. ప్రాథమికమైన అంశాలు మారకపోయినా కొన్నింటిలో మార్పులు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త చట్టం, కొత్త రూల్స్‌ ప్రకారం కేవలం సీనియర్‌ సిటిజన్లకు వచ్చే మార్పులతో కలిపి అన్ని సంగతులు ఈ వారం తెలుసుకుందాం! 
    ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యమైనది కావున మళ్లీ మళ్లీ చెప్పే విషయం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ‘ఆర్థిక సంవత్సరం’ అమల్లోకి వస్తుంది. గతంలోలాగా, అసెస్‌మెంట్‌ సంవత్సరం, గత సంవత్సరం అనే పదాలుండవు. ఇటు అసెస్సీ గానీ అటు గవర్నమెంట్, మరెవరైనా గానీ ఒకే పదం వాడాలి. ఇక నుంచి ఎవరికీ ఎటువంటి తికమక ఉండదు.  

  •     స్టాండర్డ్‌ డిడక్షన్‌ని రూ.50,000 నుంచి రూ.75,000 వరకు పెంచారు. ఈ డిడక్షన్‌ అటు పాత పద్దతిని అనుసరించే వారికైనా, ఇటు కొత్త పద్దతికి వెళ్లే వారికైనా వర్తిస్తుంది.  

  •     80డి కింద ప్రయోజనం కేవలం పాత పద్ధతిని ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. ఆరోగ్య బీమా, ముందు జాగ్రత్త హెల్త్‌ చెకప్‌కి సంబంధించిన తగ్గింపు రూ.50,000 వరకు కొనసాగుతుంది.  

  •     గత వారం ఎంతో వివరంగా చెప్పాము. కొత్త 15హెచ్‌ గురించి ... ఇప్పుడది 121గా మారింది. ఈ ఫారమ్‌ సబి్మట్‌ చేస్తే టీడీఎస్‌ చేయరు. చేయకపోతే టీడీఎస్‌ రివకరీ చేసి గవర్నమెంట్‌ ఖజానాకి చెల్లిస్తారు. సీనియర్‌ సిటిజన్ల ఆదాయం టాక్సబుల్‌ ఇన్‌కం. ఇప్పుడు దీని లిమిట్‌  రూ.12.75 లక్షలు అని చెప్పొచ్చు. ఇందులో స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75 వేలు. మీ ఆదాయం బ్యాంకు వడ్డీ కానీ, అద్దె మీద ఆదాయం కానీ, పెన్షన్‌ మీద ఆదాయం.. అన్నీ కలిపితే రూ.12.75 లక్షల దాటకపోతే వెంటనే ఫారమ్‌ 121 సంబంధిత అధికారులకు ఇవ్వండి. పన్ను రికవరీ ఉండదు.  

  •     75 సంవత్సరాలు దాటిన సీనియర్‌ సిటిజన్లకు పాత చట్టం 194పి ప్రకారం మూడు షరతుల మీద రిటర్ను వేయనవసరం లేదు. ఈ అంశాలని చాలామంది అందరికీ అన్వయించుకుంటున్నారు. అది అపోహ. ఆ మూడు షరతులు ఏంటంటే...   
    (ఎ) కేవలం పెన్షన్‌ ఉండాలి 
    (బి) ఒక బ్యాంకు నుంచి మాత్రమే వడ్డీ ఉండవచ్చు  
    (సి) అదే బ్యాంకు మొత్తం టీడీఎస్‌ రికవరీ అయ్యి గవర్నమెంట్‌ ఖజానాలో జమ అయ్యి ఉండాలి 
    ఈ సదుపాయం కొనసాగుతుంది. 

  •     ఇక ఫారాలు, గడువు తేదీ, అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపు బాధ్యతలు, సెల్ఫ్‌ అస్సెస్‌మెంట్‌ విధివిధానాలు ఇలాంటివన్నీ షరామామూలే. 

  •     ఫైలింగ్‌ విధానంలో ఎటువంటి మార్పులు లేవు.  

  •     ఇదివరకటి ఆలోచనే... ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్లు ఉండి ఎక్కువ సేవింగ్స్‌ ఉన్నవారికి పాత పద్ధతి. ఏ తగ్గింపులు ఉండవు. కొత్త పద్ధతిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎంపిక మీదే. కానీ ముందుగానే లెక్కలు వేసి ఆదాయం ఎంతో తేల్చి, నిర్ణయం తీసుకోండి. 

  •     మిగతా ఎక్కడ ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగా కొనసాగుతున్నాయి. 

  •     ప్రీ ఫిక్స్‌డ్‌ ఫారమ్‌లలో చాలా సమాచారం ఉంటుంది. అయినా జాగత్ర వహించండి.  

  •     సీనియర్‌ సిటిజన్ల సేవింగ్స్‌ స్కీంలో రూ.80 లక్షల ఇన్వెస్ట్‌ చేయొచ్చు.  

  •     రూ.5,00,000 లోపు నికర ఆదాయం ఉన్నవారు మాన్యువల్‌గా రిటర్ను వేయవచ్చు. 
    తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ రిటైర్మెంట్‌ జీవితం, జీతం జాగ్రత్తగా గడపండి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)