మారుతి సుజుకీకి రూ.5,786 కోట్ల ట్యాక్స్‌ నోటీసు!

Published on Wed, 03/18/2026 - 14:58

దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌కు ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.5,786 కోట్ల విలువైన ముసాయిదా అంచనా ఉత్తర్వులను (డ్రాఫ్ట్‌ అసెస్‌మెంట్‌ ఆర్డర్‌) జారీ చేసింది. ఈ మేరకు కంపెనీ ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది.

వివాదం ఏమిటి?

కంపెనీ తన ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపిన ఆదాయానికి, ఐటీ శాఖ అంచనాలకు మధ్య తేడాలు రావడమే ఈ నోటీసులకు ప్రధాన కారణం. రిటర్నుల్లో వెల్లడించిన ఆదాయానికి కొన్ని అంశాలను కలపడం లేదా కొన్ని మినహాయింపులను నిరాకరించడం ద్వారా ఈ భారీ మొత్తాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

కంపెనీ స్పందన

ఈ నోటీసులపై మారుతి సుజుకీ స్పందిస్తూ.. ఐటీ శాఖ ప్రతిపాదనలను సవాలు చేస్తూ వివాద పరిష్కార ప్యానెల్ ముందు అభ్యంతరాలను దాఖలు చేయనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఆర్డర్ వల్ల కంపెనీ ఆర్థిక స్థితిగతులపై లేదా రోజువారీ కార్యకలాపాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని యాజమాన్యం స్పష్టం చేసింది.

ఎగుమతులకు ‘షిప్పింగ్’ సెగ

మరోవైపు, మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఎర్ర సముద్రం, హర్మూజ్‌ జలసంధి వంటి కీలక వాణిజ్య మార్గాల్లో అంతరాయాలు కలగడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మారుతి సుజుకీతో పాటు టాటా మోటార్స్, హ్యుందాయ్ ఇండియా, వోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీలు ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు వాహనాల రవాణాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాయి.

సముద్ర మార్గాల్లో దాడుల భయం వల్ల కంటైనర్ లభ్యత తగ్గింది. దీనికి తోడు కంటైనర్‌కు 2,000 డాలర్ల వరకు ఎమర్జెన్సీ షిప్పింగ్ సర్ఛార్జీలు, యుద్ధ-ప్రమాద భీమా ప్రీమియంలు పెరగడం కంపెనీలకు భారంగా మారింది. హర్మూజ్‌ జలసంధి మీదుగా ప్రయాణించడం ప్రమాదకరమని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో నౌకలు దక్షిణాఫ్రికా మీదుగా సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఇది రవాణా వ్యయాన్ని అమాంతం పెంచుతోంది. మారుతి సుజుకీ మొత్తం ఎగుమతుల్లో మిడిల్‌ఈస్ట్‌ దేశాల వాటా దాదాపు 12.5 శాతం. తాజా అంతరాయాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Videos

జగన్ నీకు చేసిన అన్యాయం ఏమిటి? షర్మిలపై కొండా రాఘవ రెడ్డి ఫైర్

విజయవాడ ఇఫ్తార్ విందులో YS జగన్

యూట్యూబ్ వైష్ణవి భర్త అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌

వక్ఫ్ భూముల జోలికొస్తే.. కూటమికి అంజాద్ బాషా వార్నింగ్

Ugadi: తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్షలు

జగన్ ను కలిసిన HYD జర్నలిస్ట్, కె వెంకట్రామి రెడ్డి

ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు

ఇరాన్ 40ఏళ్ల ప్లానింగ్ వృధా.. ఒక్క క్షణంలో ముంచేసిన అమెరికా-ఇజ్రాయిల్..

జగన్ పాలనే బాగుంది YS షర్మిల సభలో రైతుల రియాక్షన్

Photos

+5

సాక్షి స్పెషల్.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

ఇఫ్తార్‌ విందు.. ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

ఫేమస్ వినాయక దేవాలయంలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మాళవిక (ఫొటోలు)

+5

'ధురంధర్ 2' సినిమా.. HD ఫొటోలు

+5

సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్‌ (ఫొటోలు)

+5

అందంగా రాశీఖన్నా.. చీరలో క్యూట్ శ్రీలీల (ఫొటోలు)

+5

శ్రీశైలంలో ఉగాది జాతర..నల్లమలలో పాదయాత్రగా వెళ్తున్న కర్ణాటక భక్తులు (ఫోటోలు)

+5

నటి మంచు లక్ష‍్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)