Breaking News

దీపావళి బోనస్‌లు, గిఫ్ట్‌లు భారీగా వచ్చాయా..?

Published on Sat, 10/18/2025 - 16:20

దేశమంతా దీపావళి పండుగ సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా జరిగే పెద్ద పండుగ కావడంతో దీపావళికి చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్లు, గిఫ్ట్లు ఇస్తుంటాయి. కొన్ని సంస్థలు వీటిని భారీ స్థాయిలో అందిస్తుంటాయి. ఇప్పటికే దాదాపు చాలా సంస్థలు దీపావళి బోనస్‌లు, బహుమతులు ఇచ్చేశాయి.

మరికొన్ని ఇంకా ఇవ్వాల్సి ఉండటంతో బోనస్‌లు, బహుమతుల గురించి ఆశతో ఎదురుచూస్తున్నారు. కొంతమంది నగదు బోనస్‌ను ఆశిస్తే, మరికొందరు బహుమతులు, వోచర్లు, స్వీట్లు లేదా గాడ్జెట్లు పొందుతారు. అయితే, మీకు తెలిసా? ఈ బోనస్‌లు, బహుమతులు పన్ను చెల్లింపులకు కూడా కారణమవవచ్చు.

చాలా మంది ఈ పండుగ సమయంలో వచ్చే బహుమతులు పూర్తిగా పన్ను మినహాయింపు పొందుతాయని అనుకుంటారు. కానీ వాస్తవానికి, ఇవి కూడా ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట పరిమితికి మించి ఉంటే పన్ను వర్తించవచ్చు. దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం..

ఇలా ఉంటే పన్ను మినహాయింపు

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఒక ఉద్యోగి ఏడాదిలో పొందే బహుమతులు రూ.5,000, అంత లోపు విలువ ఉంటే పన్ను మినహాయింపు పొందుతాయి. ఉదాహరణకు స్వీట్లు, దుస్తులు, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, గిఫ్ట్ వోచర్లు (రూ.5,000 లోపు విలువతో) వంటివి. ఇవి పరిధిలోపు ఉన్నట్లయితే, ఉద్యోగి ఆదాయంలోకి జోడించాల్సిన అవసరం లేదు.

రూ.5,000 దాటితే..

బహుమతుల మొత్తం విలువ రూ.5,000 మించి పోతే, ఆ మొత్తం ఉద్యోగి వార్షిక ఆదాయంలో భాగంగా పరిగణిస్తారు. వీటిని ‘పెర్క్’ (perquisite) గా లెక్కిస్తారు. ఉదాహరణకు.. రూ.10,000 విలువైన ల్యాప్‌టాప్ బహుమతిగా లభిస్తే మొత్తం రూ.10,000 ఆదాయంలోకి జోడించాలి. రూ.7,000 విలువ గల వోచర్ వచ్చినా మొత్తం వాల్యూ పన్ను పరిధిలోకి వస్తుంది.

దీపావళి క్యాష్ బోనస్

దీపావళి సందర్భంగా క్యాష్ బోనస్లపై (Diwali bonus)  కూడా ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. దీన్ని కూడా ఉద్యోగి జీతంలో భాగంగానే పరిగణిస్తారు. ఉదాహరణకు మీరు దీపావళి రోజున రూ.30,000 బోనస్ అందుకుంటే, దీన్ని మీ వార్షిక జీతానికి జోడిస్తారు. తద్వారా, మీరు ఉన్న ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

ఐటీఆర్ ఫైలింగ్‌లో జాగ్రత్తలు

రూ.5,000 కంటే ఎక్కువ విలువ ఉన్న బహుమతులను ఐటీఆర్‌లో తప్పనిసరిగా చేర్చాలి. లేని పక్షంలో, ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. సంస్థలు ఇచ్చే ఫార్మ్ 16లో ఈ వివరాలు ఉండవచ్చు. కానీ మీరు కూడా చెక్ చేయడం మంచిది.

ఇదీ చదవండి: దీపావళి ఇన్సూరెన్స్‌ రూ.5 లకే..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు