Breaking News

పన్ను ఎగవేత.. పలు రకాలు..

Published on Mon, 11/11/2024 - 07:57

పన్ను ఎగవేత చట్టరీత్యా నేరం. అనైతికం. ఆర్థికంగా సంక్షోభం తయారవుతుంది. అయితే, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. సినిమాలో ‘విలన్‌’ మనకు ఆది నుంచి చివరి వరకు కనిపిస్తాడు. నిజజీవితంలో ‘విలన్‌’ విలన్‌లాగా కనిపించడు. ఓ పరోపకారి పాపయ్యలాగా, ఓ మర్యాద రామన్నలాగా అనిపిస్తాడు. వినిపిస్తాడు. కనిపిస్తాడు. ఎంతో మోసం చేస్తాడు. మనం తెలుసుకునే లోపల తెరమరుగవుతాడు.

‘‘మీరు ఇప్పుడే మోసపోయారు’’ పుస్తకంలో రచయిత.. మనం ప్రతి రోజూ వైట్‌కాలర్‌ క్రైమ్‌ ద్వారా ఎలా మోసపోతున్నామో కళ్ళకి కట్టినట్లు తెలియజేశారు. ‘‘డబ్బుని ఎలా సంపాదించాలి’’ అనే పుస్తకంలో రచయిత ’అంకుర్‌ వారికూ’ ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఆస్తిని ఎలా ఏర్పాటు చేసుకోవాలని మొదలైన విషయాల మీద ఆచరణాత్మకమైన సలహాలు ఇస్తారు. అలాగే తెలుగు రచయతలు వీరేంద్రనాథ్‌గారు, బీవీ పట్టాభిరాం గారు తమ పుస్తకాల ద్వారా ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఇంత మంది చెప్పినా, ఇన్ని విషయాలు తెలిసినా, షరా మామూలే!

ఇదీ చదవండి: పాన్‌ కార్డ్‌ కొత్త రూల్‌.. డిసెంబర్‌ 31లోపు తప్పనిసరి!

ఒకరిని చూసి ఒకరు. ఆశతో, ప్రేరేపణతో. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు మోసం చేస్తున్నారు. పన్ను ఎగవేస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి మార్గాలున్నట్లు..

  • అకౌంట్స్‌ బుక్స్‌ నిర్వహించపోవడం, నిర్వహణలో అవకతవకలు, ఆదాయాన్ని తక్కువగా చూపించడం, ఖర్చులను పెంచేయడం

  • దురాలోచనలతో బంగారాన్ని .. అంటే ఆభరణాలు, రత్నాలు, డైమండ్లు, వెండి విషయాల్లో సెంటిమెంటు పేరు మీద, పసుపు–కుంకాల పేరు మీద, పెళ్లిళ్ల పేరు మీద కొంటున్నారు. అమ్ముతున్నారు. మళ్లీ కొంటున్నారు. పెట్టుబడికి సోర్స్‌ చెప్పరు. లాభాన్ని లెక్కించరు. ఆస్తిగా చూపించరు. ‘‘భర్తకే చెప్పం’’ అంటారు కొందరు మహిళలు. మీకు గుర్తుండే ఉంటుంది. రైళ్లలో బోగీ ఎక్కే ముందు ఇదివరకు ప్రయాణికుల జాబితా ఉండేది. పేరు, వయస్సు, లింగం, పాన్‌ నంబరు, మొదలైనవి అందులో ఉంటాయి. బంగారం షాపులవాళ్లు వారి సిబ్బందిని పంపించి ఆ వివరాలను సంగ్రహించేవారు. ఆ జాబితాను తీసుకుని, షాపునకు వచ్చి, అందులోని పేర్ల మీద ఇతరులకు అమ్మేవారు.

  • వ్యవసాయ భూమి అంటే ఏమిటో ఆదాయపు పన్ను నిర్వచించినా, గ్రామాల పేరు మార్చి, సరిహద్దులు మార్చి అమ్మకాల్లో మోసం. అలాగే ఆదాయం విషయంలో ఎన్నో మతలబులు.. ఎందుకంటే వ్యవసాయ ఆదాయం, భూమి అమ్మకాల మీద పన్ను లేదు.

  • ఇక రియల్‌ ఎస్టేట్‌ రంగంలో చెప్పనక్కర్లేదు. నేతి బీరకాయలో నేయి లేదు కానీ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ‘‘రియల్‌’’ గానే పన్ను ఎగవేత ఉంది.

  • అన్‌లిస్టెడ్‌ కంపెనీల షేర్లు, స్టాక్స్, క్రయవిక్రయాల్లో ఎన్నో అక్రమమార్గాలు అవలంబిస్తున్నారు.

  • పబ్లిక్‌ కంపెనీల్లో షేరు ప్రీమియం పేరుతో మోసాలు.. అలాగే షేర్స్‌ అలాట్‌మెంట్‌కి ముందుగా అప్లికేషన్‌తో పాటు వసూలు చేసే మనీతో మోసాలు.

  • వ్యాపారంలో సర్దుబాటు హుండీలు సహజం... వీటి మార్పిడి... ఇదొక సరిహద్దుల్లేని వ్యాపారం అయిపోయింది.

  • డమ్మీ సంస్థలు.. ఉనికిలో లేనివి.. ఉలుకు లేని..పలుకు లేని.. కాగితం సంస్థలు. కేవలం ఎగవేతకే ఎగబాకే సంస్థలు. దొంగ కంపెనీలు. డొల్ల కంపెనీలు. బోగస్‌ వ్యవహారాలు. బోగస్‌ కంపెనీలు.

  • క్రిప్టోకరెన్సీల్లో గోల్‌మాల్‌..ఇలా ఎన్నో.. ముఖ్యంగా సోర్స్‌ చెప్పకపోవడం, పెట్టుబడికి కానీ.. రాబడికి కానీ వివరణ ఇవ్వకపోవడం, పన్ను ఎగవేతకు పన్నాగం చేయడం. వీటి జోలికి పోకండి.

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌ పంపించగలరు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)