Breaking News

సిబిల్‌ స్కోర్‌ తక్కువుంటే ఏకంగా ఇంత నష్టమా?

Published on Sun, 06/09/2024 - 14:36

ఒక వ్యక్తి రుణ అర్హతను నిర్ణయించడంలో క్రెడిట్ స్కోర్‌ లేదా సిబిల్‌ స్కోర్‌ కీలకం. సరళంగా చెప్పాలంటే, ఇది రుణగ్రహీత ఆర్థిక ఆరోగ్యం గురించి తెలియజేస్తుంది. బ్యాంకులు, రుణదాతలు ఈ స్కోరును బట్టి కస్టమర్‌కు రుణం, క్రెడిట్ కార్డు లేదా ఇతర సేవలను ఇవ్వవచ్చో లేదో నిర్ణయించడానికి ఉపయోగిస్తారు.

సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోరును మంచిగా పరిగణిస్తారు. ఈ స్కోర్‌ ఉంటే తక్కువ వడ్డీ రేటుతో సులభంగా క్రెడిట్ కార్డు లేదా రుణాన్ని పొందవచ్చు. 600 కంటే తక్కువ స్కోరు ఉంటే అప్పు పొందడాన్ని కష్టతరంగా, ఖరీదైనదిగా చేస్తుంది.

రూ.19 లక్షలు అదనంగా చెల్లించాలి..
మీరు రూ.50 లక్షల హోమ్ లోన్‌ తీసుకున్నారనుకుంటే తక్కువ క్రెడిట్ స్కోర్ కారణంగా రూ.19 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదెలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం..

మీకు క్రెడిట్ స్కోర్ 820 అనుకుంటే రూ.50 లక్షల గృహ రుణం 20 ఏళ్ల కాలానికి 8.35 శాతం వడ్డీ రేటుతో పొందొచ్చు. ఈ కాల వ్యవధి పూర్తయ్యేలోపు నెలవారీ ఈఎంఐ రూ.42,918 చొప్పున మీరు తిరిగి చెల్లించే మొత్తం రూ.1.03 కోట్లు (రూ.50 లక్షల అసలు, రూ.53 లక్షల వడ్డీ) అవుతుంది.

అదే మీ క్రెడిట్ స్కోర్ 580 అయితే అదే మొత్తంపై వడ్డీ రేటు 10.75 శాతం వరకు ఉంటుంది. 20 ఏళ్లలో రూ.1.21 కోట్లు (రూ.50 లక్షల అసలు, రూ.71.82 లక్షల వడ్డీ) రుణదాతకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న కారణంగా రూ .18.82 లక్షలు అదనంగా చెల్లించాలి.

మంచి క్రెడిట్ స్కోరు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐలు, ఇతర ఆర్థిక బాధ్యతలను సకాలంలో చెల్లించేలా చూసుకోండి. ఆలస్యంగా చెల్లింపులు లేదా డిఫాల్ట్‌లు మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.

  • మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని (మీరు ఉపయోగిస్తున్న మీ క్రెడిట్ లిమిట్ శాతం) 30 శాతం కంటే తక్కువగా ఉంచుకోండి. అధిక వినియోగం అధిక క్రెడిట్ రిస్క్‌ను  సూచిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

  • మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించుకోండి. తప్పులను వెంటనే సరిదిద్దుకోవడం వల్ల మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్‌కు అనవసరమైన నష్టాన్ని నివారించవచ్చు.

  • రుణాలు వంటి క్రెడిట్ కోసం తరచుగా వచ్చే దరఖాస్తులు మీ నివేదికపై అనేక కఠినమైన విచారణలకు దారితీస్తాయి. ఇది మీ స్కోరును తగ్గిస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే కొత్త క్రెడిట్ కోసం దరఖాస్తు చేసుకోండి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)