Breaking News

పిండం వయసును నిర్ధారించే ఏఐ.. ఎవరు తయారు చేశారంటే..

Published on Wed, 02/28/2024 - 17:39

గర్భంలోని పిండం వయసును అత్యంత కచ్చితత్వంతో లెక్కింటే ఒక కృత్రిమ మేధ (ఏఐ) పరికరాన్ని ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఇది నిర్దిష్టంగా భారతీయ అవసరాలకు ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఇది మూడు నెలలు పైబడిన పిండం వయసును లెక్కించడానికి సాయపడుతుంది. 

పరిశోధనలో ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌(టీహెచ్‌ఎస్‌టీఐ) పరిశోధకులు కూడా భాగస్వాములయ్యారు. పిండం వయసును కచ్చితత్వంతో నిర్ధారించడం చాలా అవసరం. దానివల్ల గర్భిణికి సరైన సంరక్షణ అందించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే కాన్పు తేదీని కూడా నిర్దిష్టంగా అంచనా వేయవచ్చు. 

తాజా ఏఐ పరికరానికి ‘గర్భిణి-జీఏ2’ అని పేరు పెట్టారు. భారతీయ జనాభా డేటాను ఉపయోగించి రూపొందిన తొలి ఏఐ సాధనం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం పశ్చిమ దేశాల జనాభా కోసం రూపొందించిన ఒక సూత్రం ఆధారంగా పిండం వయసును లెక్కిస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రైవేట్‌ వైద్యం.. ఛార్జీలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు

మూడు నెలలు నిండాక దీన్ని వర్తింపజేస్తే.. ఫలితంలో తప్పు రావొచ్చు. భారతీయ జనాభాలో పిండం ఎదుగుదలలో ఉన్న వైరుధ్యాలే ఇందుకు కారణం. ‘గర్భిణి-జీఏ2’తో ఈ ఇబ్బందిని అధిగమించొచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. తద్వారా భారత్‌లో మాతా శిశు మరణాల రేటు తగ్గుతుందని చెప్పారు.

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)