Breaking News

ఐఐటీ హైదరాబాద్‌లో అద్భుతం.. డ్రైవర్‌ లేని బస్సుల ఘనత

Published on Wed, 08/13/2025 - 18:31

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) క్యాంపస్‌లో అద్భుత ఘనత నమోదైంది. క్యాంపస్‌ రోడ్లపై రోజువారీ సేవల కోసం అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత డ్రైవర్ రహిత బస్సులు రోజుల వ్యవధిలోనే 10,000 మందికి పైగా ప్రయాణీకులను తరలించాయి. ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్) రూపొందించిన వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్‌గా, మానవ డ్రైవర్ లేకుండా నడుస్తాయి.

ఆరు సీట్ల, పద్నాలుగు సీట్లుగా రెండు వేరియంట్ల వాహనాలు ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో సేవలు అందిస్తున్నాయి. కొత్తగా క్యాంపస్ రోడ్లపైకి వచ్చిన ఈ బస్సులు ఇప్పటికే 10,000 మందికి పైగా ప్రయాణీకులను తరలించాయి. ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ ఎక్కువగా సానుకూలంగా ఉందని, 90 శాతం సంతృప్తి రేటు ఉందని టిహాన్ నివేదించింది.

అన్ని విధాలా సిద్దంగా..
ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన డ్రైవర్ రహిత బస్సులు కేవలం ప్రయోగాత్మకం కాదు. సాంకేతికపరంగా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాయి. ఈ బస్సులలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వ్యవస్థలను అమర్చారు. ఇవి వేగాన్ని సర్దుబాటు చేయడానికి, అడ్డంకులను గుర్తించడానికి, సురక్షిత దూరాలను నిర్వహించడానికి అనుమతిస్తాయి.

ఈ డ్రైవర్‌ రహిత బస్సుల ప్రాజెక్ట్ టెక్నాలజీ రెడీనెస్ లెవల్ 9కు చేరుకుంది. అంటే ఇది వాస్తవ-ప్రపంచ పరిస్థితులలో నిరూపించుకుంది. ఐఐటీ హైదరాబాద్‌కు ఈ ప్రాజెక్ట్ ఒక రవాణా పరిష్కారం మాత్రమే కాకుండా భారతదేశ మొబిలిటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణ సాధ్యమని చూపించే ఒక ప్రదర్శన. దేశంలోనే తొలి అటానమస్ నావిగేషన్ టెస్ట్‌బెడ్‌ను కూడా టిహాన్ నిర్మించింది.

ఈ సదుపాయం భారతీయ డ్రైవింగ్ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. కంపెనీలు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు పబ్లిక్ రోడ్లపై ఉపయోగించే ముందు సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థలను పరీక్షించడానికి, ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)