Breaking News

దేశంలోనే తొలి ఇంక్యుబేటర్ లింక్డ్ వీసీ ఫండ్ ప్రారంభం

Published on Wed, 12/10/2025 - 17:39

దేశ ఆవిష్కరణల విభాగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఐఐటీ బాంబేలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌(SINE) దేశంలోనే మొట్టమొదటి ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ప్రారంభించింది. ‘వై-పాయింట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌’గా పిలువబడే ఈ ఫండ్‌ను మొత్తం రూ.250 కోట్ల పరిమాణంతో ప్రారంభ దశలో ఉన్న డీప్ టెక్ స్టార్టప్‌లకు క్యాపిటల్‌ను అందించడానికి ప్రత్యేకంగా సిద్ధం చేశారు.

దీని ద్వారా ఐఐటీ బాంబే దేశంలో తన సొంత వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను నిర్వహించే మొదటి అకడమిక్‌-అనుబంధ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా అవతరించింది. హై-పొటెన్షియల్ స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్, మెంటార్‌షిప్ సేవలు అందిస్తున్న ఎస్‌‌ఐఎన్‌ఈకు ఈ ఫండ్ ఎంతో తోడ్పడుతుందని ఐఐటీ బాంబే తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ నిధి దాదాపు 25 నుంచి 30 స్టార్టప్‌లకు ఆర్థిక మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ఒక్కో స్టార్టప్‌కు గరిష్టంగా రూ.15 కోట్ల వరకు పెట్టుబడి సాయం అందుతుంది.

విస్తృత రంగాలకు మద్దతు

రొబోటిక్స్, మెటీరియల్ సైన్సెస్, అడ్వాన్స్‌డ్‌ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), స్పేస్ టెక్నాలజీస్, బయోటెక్నాలజీ వంటి కీలక డీప్ టెక్ రంగాల్లో పనిచేసే స్టార్టప్‌లకు వై-పాయింట్ ఫండ్ మద్దతు అందిస్తుంది. ముఖ్యంగా ఐఐటీ బాంబే రిసెర్చ్‌ ఎన్విరాన్‌మెంట్‌, టెక్ ల్యాబ్‌లు, వ్యవస్థాపక నెట్‌వర్క్‌ల నుంచి ఉద్భవించే కంపెనీలకు ఇది చేదోడుగా ఉంటుంది. అంతేకాకుండా, ఇతర ప్రీమియర్ అకడమిక్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వచ్చే డీప్ టెక్ స్టార్టప్‌లకు కూడా ప్రోత్సాహం అందిస్తుంది.

ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)