Breaking News

రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగం! ఏ రంగంలో తెలుసా..

Published on Wed, 02/14/2024 - 13:31

దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) ఒకటి. ఇందులో చదివితే మంచి ప్యాకేజీతో ఉన్నత సంస్థలో కొలువు సాధించవచ్చనే భావన ఉంది. అనుకున్నట్టుగానే తాజాగా ఇందోర్‌ ఐఐఎంలో ఓ విద్యార్థి ఏకంగా రూ.కోటి వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించారు. 

ఐఐఎం ఇందోర్‌లో ఈ-కామర్స్‌ సంస్థలు ఇటీవల నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థి ఈ ఆఫర్‌ను సాధించారు. ఈ ఏడాది చివరి దశ ప్లేస్‌మెంట్లలో ఇదే అత్యధిక ప్యాకేజీ. ఇందుకు సంబంధించిన వివరాలను ఐఐఎం-ఇందోర్ అధికారి పీటీఐతో పంచుకున్నారు.

ఐఐఎం ఇందోర్‌లో నిర్వహించిన చివరి విడుత ప్లేస్‌మెంట్స్‌లో 150 కంపెనీలు 594 మంది విద్యార్థులకు ఆఫర్లు వచ్చాయి. ఈ ఇంటర్వ్యూల్లో రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ప్లేస్‌మెంట్‌ పొందిన విద్యార్థులకు లభించిన ఆఫర్ సగటున రూ.25.68 లక్షల వేతనం అని ఐఐటీ ఇండోర్ తెలిపింది. గరిష్ఠంగా ఓ విద్యార్థికి ఏకంగా ఏటా రూ.కోటి వార్షిక వేతనంతో ఆఫర్‌ వచ్చిందని చెప్పింది.  సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగంలో ఈ విద్యార్థికి ఉద్యోగం లభించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. 

ఇదీ చదవండి: హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్‌ ఇదే..!

ప్రస్తుతం ఉద్యోగాల మార్కెట్లో సవాళ్లు ఎదురవుతున్నా ఐఐఎం ఇందోర్ తన పేరు నిలుపుకోవడంతోపాటు అతిపెద్ద కంపెనీలను ఆకర్షించగలిగింది. ఈ ఏడాది కొత్తగా 50కి పైగా కంపెనీలు తమ సంస్థలో ఇంటర్వ్యూలు నిర్వహించాయని ఐఐఎం ఇందోర్ డైరెక్టర్ హిమాంశురాయ్ తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)