Breaking News

ఇండస్‌ఇండ్‌–ఇన్వెస్కో సంయుక్త ఫండ్స్‌ వ్యాపారం

Published on Tue, 11/04/2025 - 08:32

హిందుజా గ్రూప్‌నకు చెందిన ఇండస్‌ ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకీ అడుగుపెట్టింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రమోటర్‌ అయిన ఇండస్‌ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్, అమెరికాకు చెందిన ఇన్వెస్కో సంయుక్తంగా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించాయి. ఇన్వెస్కోకు చెందిన ఇన్వెస్కో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఇండియాలో ఇండస్‌ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ (ఐఐహెచ్‌ఎల్‌) 60 శాతం వాటా కొనుగోలు చేసింది. మిగిలిన 40 శాతం వాటాను ఇన్వెస్కో కలిగి ఉంటుంది.

2025 సెప్టెంబర్‌ చివరికి ఇన్వెస్కో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఇండియా రూ.1,48,358 కోట్ల నిర్వహణ ఆస్తులతో (ఏయూఎం) 16వ అతిపెద్ద అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థగా ఉంది. ఇరు సంస్థలు తమదైన బలాబలాలతో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపార వృద్ధికి కృషి చేయనున్నట్టు ప్రకటించాయి. ఇన్వెస్కోకు అంతర్జాతీయంగా పెట్టుబడుల నిర్వహణలో ఉన్న అపార అనుభవం, ఇండస్‌ ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌కు భారత్‌లో ఉన్న బ్యాంక్, బీమా సంస్థల పంపిణీ బలాలతో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారాన్ని మరింత మంది ఇన్వెస్టర్లకు చేరువ చేయగలమని ఇవి భావిస్తున్నాయి. సౌరభ్‌ నానావతి ఆధ్వర్యంలోని ప్రస్తుత మేనేజ్‌మెంట్‌ ఇక ముందూ కొనసాగుతుందని ఈ సంస్థలు ప్రకటించాయి.  

ఆర్థిక సేవల దిగ్గజంగా అవతరిస్తాం..

అసెట్‌ మేనేజ్‌మెంట్‌ను కూడా చేర్చుకోవడం ద్వారా 2030 నాటికి ఆర్థిక సేవల దిగ్గజంగా అవతరించేందుకు వీలు కలుగుతుందని ఐఐహెచ్‌ఎల్‌ చైర్మన్‌ అశోక్‌ హిందుజా పేర్కొన్నారు. ‘‘భారత్‌లో ఆదాయాలు పెరుగుతున్నాయి. జనాభా పరమైన అనుకూలతలు ఉన్నాయి. అద్భుతమైన పెట్టుబడుల అవకాశాలు పలకరిస్తున్నాయి. కనుక ఇదొక చక్కని అనుకూల తరుణం’’అని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు