Breaking News

హోమ్‌ ఫైనాన్స్‌కు రూ.858 కోట్ల రుణం

Published on Mon, 07/14/2025 - 07:34

ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) నుంచి రూ.858 కోట్ల (100 మిలియన్లు) రుణాన్ని పొందినట్లు ఐఐఎఫ్‌ఎల్‌ హోమ్‌ ఫైనాన్స్‌ సంస్థ శనివారం తెలిపింది. ‘‘దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు సొంతింటి ఏర్పాటు అవకాశాలు మెరుగుపరిచే లక్ష్య సాధనలో ఏబీబీ నుంచి నిధులు అందడం ఒక కీలక ఘట్టం’’ అని ఐఐఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎఫ్‌ఎల్‌ సీఈవో మోను రాత్రా తెలిపారు.

ఐఐఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎఫ్‌ఎల్‌ భాగస్వామ్యం ద్వారా భారత గృహ నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల భవనాలు (గ్రీన్‌ బిల్డింగ్‌) ప్రమాణాలు మరింత మెరుగుతాయని ఏఐఐబీ డైరెక్టర్‌ జనరల్‌  గ్రెగొరీ లియు తెలిపారు. ఏఐఐబీ నుంచి పొందిన నిధులు దేశ అఫర్డబుల్‌ హౌసింగ్‌ వ్యవస్థలో డిమాండ్‌తోపాటు సరఫరా సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయని ఐఐఎఫ్‌ఎల్‌ హోమ్‌ ఫైనాన్స్‌ భావిస్తోంది.

డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఐఐఎఫ్‌ఎల్‌ హోమ్‌ ఫైనాన్స్‌ ప్రధానంగా పట్టణ ప్రాంతాలలోని ఆర్థికంగా వెనుకబడిన, అల్పాదాయ వర్గాలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గృహ రుణ వితరణను మరింత పెంచనుంది. ఇక సప్లయిపరంగా అందుబాటు ధరల్లో గృహాలు అభివృద్ధి చేసే హౌసింగ్‌ డెవలపర్లకు ఫైనాన్స్‌ సాయం అందించనుంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)