Breaking News

ఐజీఎల్‌ 1:1 బోనస్‌.. ప్రతి షేరుకీ మరో షేరు ఉచితం

Published on Thu, 12/12/2024 - 09:09

న్యూఢిల్లీ: సిటీ గ్యాస్‌ రిటైల్‌ పీఎస్‌యూ.. ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌(ఐజీఎల్‌) తొలిసారి వాటాదారులకు బోనస్‌ షేర్లను ప్రకటించింది. 1:1 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనుంది. ఇందుకు కంపెనీ నిర్వహించిన తాజా సమావేశంలో బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వెరసి వాటాదారుల వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని ఉచితంగా కేటాయించనుంది.

తద్వారా వాటాదారులకు రివార్డుతోపాటు.. రిటైల్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకోనుంది. బోనస్‌ షేర్ల జారీతో కంపెనీ వాటా మూలధనం రెట్టింపు కానుంది. రూ. 140 కోట్ల నుంచి రూ. 280 కోట్లకు పెరగనుంది. కంపెనీ వద్దగల రూ. 8,412 కోట్ల రిజర్వు నిధుల నుంచి బోనస్‌ ఈక్విటీ(రూ. 140 కోట్లు) నిధులను సమకూర్చుకోనుంది. తదుపరి దశలో ప్రకటించనున్న రికార్డ్‌ డేట్‌ ప్రకారం రెండు నెలల్లోగా బోనస్‌ షేర్లను కేటాయించే వీలున్నట్లు ఐజీఎల్‌ స్టాక్‌ ఎక్స్చేంజీలకు తెలియజేసింది.  

గ్యాస్‌ పంపిణీ ఇలా 
దేశీయంగా సిటీ గ్యాస్‌ పంపిణీలో అతిపెద్ద రిటైలర్‌గా నిలుస్తున్న ఐజీఎల్‌ ఆటోమొబైల్స్‌కు సీఎన్‌జీ, పరిశ్రమలు, గృహాలకు పైప్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌(పీఎన్‌జీ)ను సరఫరా చేస్తోంది. ఢిల్లీసహా సమీప ప్రాంతాలైన నోయిడా, గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లో సిటీ గ్యాస్‌ పంపిణీ బిజినెస్‌ను నిర్వహిస్తోంది. వీటితోపాటు హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ రిటైల్‌ గ్యాస్‌ సర్వీసులు అందిస్తోంది.

ఇదీ చదవండి: వొడాఫోన్‌ ఐడియా షేర్ల జారీ

సుమారు 882 స్టేషన్ల ద్వారా 1.7 మిలియన్‌ వాహనాలకు సీఎన్‌జీ సరఫరా చేస్తోంది. 2.5 మిలియన్‌ గృహాలకు పీఎన్‌జీ అందిస్తోంది. పీఎస్‌యూ దిగ్గజాలు గెయిల్‌(ఇండియా), బీపీసీఎల్‌తోపాటు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాగస్వామ్య కంపెనీ ఇది! బోనస్‌ వార్తల నేపథ్యంలో ఐజీఎల్‌ షేరు 1.6 శాతం లాభంతో రూ. 392 వద్ద ముగిసింది.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)