Breaking News

బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే.. ఖాతాలో డబ్బు ఏమవుతుంది?

Published on Sun, 12/28/2025 - 20:16

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఛానళ్లు అకౌంట్ ఉపయోగించకుండా ఉంటే ఏమవుతుంది?, ఖాతాలోని డబ్బును మళ్లీ విత్‌డ్రా చేసుకోవచ్చాయా?, అనే విషయాలు బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు.

బ్యాంక్ అకౌంట్‌ను రెండేళ్లు ఉపయోగించకుండా (ఎలాంటి లావాదేవీలు చేయకుండా) ఉంటే.. ఇనాక్టివ్ లేదా డోర్మాంట్ అవుతుంది. కొన్ని బ్యాంకుల్లో ఈ గడువు ఏడాది మాత్రమే. అంటే.. గడువు లోపల చిన్న చిన్న లావాదేవీలైన తప్పకుండా చేసి ఉండాలి. లేకుంటే.. డెబిట్ కార్డు పనిచేయకపోవచ్చు, ఆన్‌లైన్ లావాదేవీలు నిలిచిపోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా.. మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు చెల్లించాలి ఉంటుంది. కాబట్టి ఖాతాలోని బ్యాలెన్స్ నెమ్మదిగా తగ్గిపోతుంది.

మీ బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్ అయినప్పటికీ.. అకౌంట్‌లో ఉన్న ఎక్కడికీ పోదు. కానీ ఎక్కువ కాలం ఎవరు క్లెయిమ్ చేయకపోతే.. ఖాతాలోని మొత్తం డబ్బు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్' (DEAF)కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇలా జరిగినప్పుడు.. కావలసిన కేవైసీ పూర్తి చేసి మళ్లీ మీ ఖాతాలోని డబ్బును తీసుకోవచ్చు.

కేవైసీ అప్డేట్ చేయాలంటే..
కేవైసీ అప్డేట్ చేసి.. మళ్లీ మీ ఖాతాను యాక్టివేట్ చేయాలంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి. అక్కడ ఆధార్, పాన్ వంటివాటితో కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత చిన్న మొత్తంలో లావాదేవీలను చేసుకోవాలి. ఇలా చేస్తే.. మీ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అవుతుంది.

ఇదీ చదవండి: పెరిగిన ధరలు.. వెండి అవసరం!: మస్క్ ట్వీట్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)