Breaking News

ఫోన్‌ నీటిలో పడిందా..? ఇలా చేయండి..

Published on Mon, 10/23/2023 - 19:26

ప్రతి ఒక్కరి జీవితంలోను ఫోన్ భాగమైపోయింది. స్మార్ట్‌ఫోనో..ఫీచర్‌ఫోనో ఏదో ఒకటి తప్పకుండా ఉపయోగిస్తున్నారు. అయితే  మనదో..మనకు తెలిసిన వారి ఫోన్‌ ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడం చూస్తుంటారు. అలాంటి సమయంలో ఫోన్‌ను వెంటనే ఆరబెట్టే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఇలా ఫోన్ నీళ్లలో పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలా చేయడం వల్ల ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

చేయకూడనివి..

నీటిలో తడిచిన వెంటనే ఫోన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆన్ చేయవద్దు. బటన్లను ప్రెస్ చేయటం కానీ, ఫోన్‌ను షేక్ చేయటం కాని చేయవద్దు. మీకు ఫోన్ గురించి తెలిసినా ఓపెన్ చేయవద్దు. ఇష్టమొచ్చినట్లు ఓపెన్ చేయటం వల్ల వారంటీ కోల్పోవలసి వస్తుంది. తడిసిన ఫోన్‌పై గాలిని ఊదే ప్రయత్నం చేయకూడదు. దాంతో నీరు లోపలి భాగాల్లోకి వెళ్లే ప్రమాదముంది. అవగాహన లేకుండా ఎలాంటి హీట్ డ్రైయర్‌ను ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువగా నీరు చేరే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకే చోట వేడెక్కి మిగతా భాగాలను దెబ్బతీస్తాయి.

చేయాల్సినవి..

వారెంటీ, ఇన్సూరెన్స్‌ ఉంటే వెంటనే సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లాలి. ఇన్సూరెన్స్‌ అయిపోతే ముందుగా ఫోన్‌ను ఓపెన్ చేసి సిమ్‌తోపాటు మైక్రో ఓఎస్డీకార్డ్‌ను తొలగించాలి. రిములబుల్‌ బ్యాటరీ ఫోన్‌ అయితే బ్యాటరీని ఫోన్ నుంచి వేరు చేయాలి. క్లాత్ లేదా పేపర్ తీసుకుని చాలా సున్నితంగా ఫోన్‌లోని తడి భాగాలను తుడవాలి. తడిబారిన ప్రదేశం సాధారణ స్థాయికి వచ్చిన తరువాత  సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లాలి. అయితే జిప్‌లాక్ బ్యాగ్‌లో బియ్యాన్ని వేసి అందులో ఫోన్‌ను ఉంచి కప్పివేయాలని, అందువల్ల తేమశాతం తగ్గుతుందని కొందరు సూచిస్తుంటారు. అయితే దాంతో పూర్తిగా ప్రయోజనం ఉండదు. తాత్కాలికంగా అలా చేసినా మళ్లీ సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లాలి.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)