Breaking News

నీరజ్‌ ‘గోల్డ్‌’ గెలిస్తే అందరికీ... ఓ సీఈవో అదిరిపోయే ఆఫర్‌!

Published on Fri, 08/02/2024 - 15:01

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024)లో బంగారు పతకం సాధిస్తే అందరికీ ఉచిత వీసాలు ఇస్తామని ఆన్‌లైన్ వీసా స్టార్టప్ సంస్థ అట్లీస్ సీఈవో మోహక్ నహ్తా హామీ ఇచ్చారు. ఆయన ప్రకటించిన ఆఫర్‌ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో ఓ పోస్ట్‌ను పంచుకుంటూ.. "ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే నేను వ్యక్తిగతంగా అందరికీ ఉచిత వీసా పంపుతాను" అంటూ ప్రకటించారు. జూలై 30న నహ్తా పోస్ట్‌ పెట్టిన వెంటనే, ఈ ఆఫర్‌కు సంబంధించి యూజర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తన ఆఫర్‌ను వివరిస్తూ మరో పోస్ట్‌ను మోహక్ నహ్తా షేర్‌ చేశారు.

"నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే అందరికీ ఉచిత వీసా ఇస్తామని జూలై 30న వాగ్దానం చేశాను. చాలా మంది అడిగారు కాబట్టి, ఇవిగో వివరాలు.." అంటూ తాజా పోస్ట్‌లో పూర్తి వివరాలు అందించారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా ఆగస్ట్ 8న పతకాల కోసం పోటీపడతాడు. ఆయన బంగారు పతకం సాధిస్తే, ఒక రోజంతా వినియోగదారులందరికీ ఒక ఉచిత వీసా అందిస్తామన్నారు. ఆ రోజు అన్ని దేశాలకు వీసా ఖర్చును కంపెనీ భరిస్తుందని ఆయన తెలిపారు.

వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్‌ను కామెంట్‌ సెక్షన్‌లో తెలియజేస్తే కంపెనీ ఉచిత వీసా క్రెడిట్‌తో యూజర్‌ తరపున ఖాతాను సృష్టిస్తుందన్నారు. సీఈవో మోహక్ నహ్తా పోస్ట్ లింక్డ్‌ఇన్ ప్లాట్‌ఫారమ్‌లో భాఈగా రీపోస్ట్‌లు, లైక్‌లు, కామెంట్‌లను పొందింది. యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న అట్లీస్ కంపెనీకి భారత్‌లోని ఢిల్లీ, ముంబైలలో శాఖలు ఉన్నాయి.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)