Breaking News

భారత్ ప్రపంచకప్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తామన్న సీఈఓ

Published on Sat, 11/18/2023 - 20:38

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే ఏకంగా రూ.100 కోట్లు ఇస్తానని ఆస్ట్రోటాక్ సీఈఓ పునీత్ గుప్తా ప్రకటించారు. ఆస్ట్రోటాక్ వినియోగదారులకు ఈ డబ్బును పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తన లింక్డ్‌ఇన్‌ ఖాతాలో కొన్ని విషయాలను పంచుకున్నారు. 

‘భారత్‌ చివరిసారి 2011లో ప్రపంచకప్ గెలిచినప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను. అవి నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజులు. చండీగఢ్‌లోని కళాశాల సమీపంలో ఉన్న ఆడిటోరియంలో నా స్నేహితులతో కలిసి ఆ మ్యాచ్‌ని చూశాను. ఆ సమయంలో రోజంతా చాలా టెన్షన్‌గా ఉన్నాం. మ్యాచ్ జరిగే ముందురోజు గెలుపోటములపై చర్చించాం. దాంతో సరిగా నిద్రపోలేదు. ఆరోజు విజయాన్ని పంచుకునేందుకు నాకు కొందరు స్నేహితులు ఉండేవారు. ఈసారి ఇండియా విజయాన్ని పంచుకునేందకు చాలా మంది ఆస్ట్రోటాక్ వినియోగదారులు ఉన్నారు. అందరూ ఇండియా గెలవాలని ప్రార్థించాలి’ అని తెలిపారు. 

ఇదీ చదవండి: అక్కడ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ రోజున ఉచిత వసతి!

‘టీం ఇండియా ఫైనల్‌ మ్యాచ్‌లో గెలిస్తే నా ఆనందాన్ని పంచుకోవడానికి ఏదైనా చేయాలి. కాబట్టి, ఈరోజు నా ఫైనాన్స్ టీమ్ సభ్యులతో చర్చించాను. భారత్‌ కప్ గెలిస్తే మా వినియోగదారులకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తాను’అని చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)