Breaking News

వ్యాపార సామ్రాజ్యంలో రారాజు ఎవరంటే..

Published on Wed, 12/17/2025 - 18:32

భారత కార్పొరేట్ రంగంలో 2000 సంవత్సరం తర్వాత స్వయంకృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తల జాబితా విడుదలైంది. ఇందులో సంప్రదాయ వ్యాపార దిగ్గజాలను వెనక్కి నెట్టి టెక్ ఆధారిత స్టార్టప్‌లు దూసుకుపోతున్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ప్రైవేట్‌, హురున్‌ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ‘టాప్‌-200 వ్యాపారవేత్తల జాబితా 2025’లో జొమాటో మాతృసంస్థ ఎటర్నెల్ సీఈఓ దీపిందర్ గోయల్ అగ్రస్థానంలో నిలిచారు.

ఇప్పటివరకు రిటైల్ రంగంలో తిరుగులేని శక్తిగా ఉన్న డీమార్ట్ (అవెన్యూ సూపర్‌మార్ట్స్) అధినేత రాధాకృష్ణ దమానీని దీపిందర్ గోయల్‌ వెనక్కి నెట్టి రెండో స్థానానికి పరిమితం చేశారు. గడిచిన ఏడాది కాలంలో ఎటర్నెల్ మార్కెట్ విలువ 27 శాతం వృద్ధి చెంది రూ. 3.2 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ విలువ 13 శాతం క్షీణించి రూ.3 లక్షల కోట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా 800 నగరాల్లో సేవలందిస్తున్న జొమాటో నెట్‌వర్క్ దీపిందర్‌ను ఈసారి జాబితాలో మొదటిసారి నిలపడమే కాకుండా నేరుగా అగ్రస్థానంలో కూర్చోబెట్టింది.

తొలి ప్రయత్నంలోనే మూడో స్థానం

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకులు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ ఈ జాబితాలో తొలిసారి చోటు సంపాదించి ఏకంగా మూడో స్థానంలో నిలవడం విశేషం. వీరి సంస్థ ‘ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్’ మార్కెట్ విలువను రూ.2.2 లక్షల కోట్లుగా హురున్ లెక్కగట్టింది. విమానయాన రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ 65 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో అగ్రగామిగా దూసుకుపోతోందని ఈ నివేదిక ప్రశంసించింది.

టాప్-10 సెల్ఫ్‌మేడ్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ 2025

ర్యాంక్వ్యాపారవేత్తలుకంపెనీ పేరు
1దీపిందర్ గోయల్ఎటర్నెల్ (జొమాటో)
2రాధాకృష్ణ దమానీడీమార్ట్
3రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ఇండిగో
4అభయ్ సోయిమ్యాక్స్ హెల్త్‌ కేర్‌
5శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డిస్విగ్గీ
6దీప్ కర్లా, రాజేశ్ మాగౌమేక్ మై ట్రిప్
7యాశిష్ దహియా, అలోక్ బన్సల్పాలసీ బజార్
8విజయ్ శేఖర్ శర్మపేటీఎం
9ఫల్గుణి నాయర్, అద్వైత్ నాయర్నైకా
10పీయూష్ బన్సల్ & టీమ్లెన్స్‌కార్ట్‌

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)