Breaking News

ఈ బ్యాంకులో​ వడ్డీ రేట్లు మారాయ్‌..

Published on Wed, 03/27/2024 - 14:41

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లను (FD) సురక్షితమైన ఎంపికగా చాలా మంది పరిగణిస్తారు. నేటికీ పెట్టుబడి కోసం ఎఫ్‌డీలను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు డిపాజిటర్లను ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ప్రకటిస్తున్నాయి. తాజగా ప్రైవేట్ రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్ (IDFC FIRST Bank) ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. 

ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినవారు లేదా చేయాలనుకుంటున్న వారు సవరించిన వడ్డీ రేట్లను పరిశీలించవచ్చు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీ సౌకర్యాన్ని అందిస్తోంది. మీరు 3 శాతం నుండి 8 శాతం వరకు వడ్డీ ప్రయోజనం పొందవచ్చు. 500 రోజుల ఎఫ్‌డీపై బ్యాంక్ అత్యధికంగా 8 శాతం వడ్డీ రేటును ఇస్తోంది.

ఎఫ్‌డీ చేసే సీనియర్ సిటిజన్లకు ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది. వీరికి 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా వడ్డీని అందిస్తోంది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు  2024 మార్చి 21 నుండి అమలులోకి వస్తాయి.

సాధారణ పౌరులకు వడ్డీశాతం

  • 7 నుండి 45 రోజులు - 3 శాతం
  • 46 నుండి 180 రోజులు - 4.50 శాతం
  • 181 రోజుల నుండి ఏడాదిలోపు - 5.75 శాతం
  • 1 సంవత్సరం - 6.50 శాతం
  • 1 సంవత్సరం 1 రోజు నుండి 499 రోజులు - 7.50 శాతం
  • 500 రోజులు - 8 శాతం
  • 501 రోజుల నుండి 548 రోజులు - 7.50 శాతం
  • 549 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు - 7.75 శాతం
  • 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు - 7.25 శాతం
  • 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్ల​ వరకు - 7 శాతం

సీనియర్ సిటిజన్లకు..

  • 7 నుండి 45 రోజులు - 3.50 శాతం
  • 46 నుండి 180 రోజులు - 5 శాతం
  • 181 రోజుల నుండి ఏడాదిలోపు - 6.25 శాతం
  • 1 సంవత్సరం - 7 శాతం
  • 1 సంవత్సరం 1 రోజు నుండి 499 రోజులు - 8 శాతం
  • 500 రోజులు - 8.50 శాతం
  • 501 రోజుల నుండి 548 రోజులు - 8 శాతం
  • 549 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు - 8.25 శాతం
  • 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు - 7.75 శాతం
  • 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్ల వరకు - 7.50 శాతం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)