కొత్త రకం క్రెడిట్‌ కార్డు.. ఎఫ్‌డీ, యూపీఐ లింక్‌తో..

Published on Mon, 01/20/2025 - 21:06

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్ (IDFC FIRST Bank) రూపే (RuPay) భాగస్వామ్యంతో ఫస్ట్‌ ఎర్న్‌ (FIRST EARN) పేరుతో కొత్త రకం క్రెడిట్‌ కార్డును ప్రారంభించింది. యూపీఐ (UPI), ఎఫ్‌డీ (FD) లింక్‌తో ఈ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించినట్లు బ్యాంక్‌ ప్రకటించింది. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు అనుసంధానంగా దీన్ని జారీ చేస్తారు. దీంతో యూపీఐ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

ఈ క్రెడిట్‌ కార్డు దరఖాస్తులోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ తెరిచే అంశాన్ని కూడా ఏకీకృతం చేసి ఉంటారు. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే  వడ్డీ ఈ కార్డుకు జమవుతుంది. అలాగే కస్టమర్‌లు ఈ కార్డు ద్వారా యూపీఐలో క్రెడిట్‌ని, రివార్డ్‌లను పొందే అవకాశం ఉంటుంది. ఈ క్రెడిట్‌ కార్డును యూపీఐతో సజావుగా అనుసంధానించడం వల్ల దేశం అంతటా 6 కోట్లకుపైగా యూపీఐ అనుసంధానిత మర్చెంట్ల వద్ద దీన్ని వినియోగించవచ్చు. ప్రతి యూపీఐ ఖర్చుపైనా కస్టమర్‌లు 1 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందుతారు. దీంతో ప్రతి లావాదేవీ రివార్డ్‌గా మారుతుంది.

"ఇది ఆర్థిక సేవల ప్రపంచానికి గేట్‌వే ఉత్పత్తిగా మొదటిసారి క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందింది" అని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌  బ్యాంక్‌లో క్రెడిట్ కార్డ్స్, ఫాస్ట్‌ట్యాగ్, లాయల్టీ ని హెడ్ శిరీష్ భండారి పేర్కొన్నారు. "ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ బ్యాక్డ్ క్రెడిట్ కార్డ్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. కార్డ్ ఖాతాకు ఆటోమేటిక్‌గా క్రెడిట్ చేసే  1 శాతం క్యాష్‌బ్యాక్‌తో ప్రతి రోజు యూపీఐ చెల్లింపులను తక్షణమే సూపర్ రివార్డింగ్ చేస్తుందని తెలిపారు.

ఫస్ట్‌ ఎర్న్‌ క్రెడిట్‌ కార్డు ముఖ్య ఫీచర్లు
» ఈ క్రెడిట్ కార్డ్ 6 కోట్ల కంటే ఎక్కువ క్యూఆర్‌ కోడ్‌లలో యూపీఐ లావాదేవీలను అనుమతిస్తుంది .

» ఇది వర్చువల్ క్రెడిట్ కార్డ్. తక్షణ ఉపయోగం కోసం యూపీఐ ఇంటిగ్రేషన్‌తో తక్షణమే జారీ చేస్తారు.

» ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా అందించే సురక్షిత క్రెడిట్ కార్డ్. అందరికీ అందుబాటులో ఉంటుంది.

» కొత్త కార్డ్ హోల్డర్‌లు కార్డు జారీ చేసిన 15 15 రోజులలోపు చేసే మొదటి యూపీఐ లావాదేవీపై 100 శాతం రూ. 500 వరకు  క్యాష్‌ బ్యాక్‌ పొందుతారు.ప్రభావవంతంగా మొదటి సంవత్సరం ఫీజు క్యాష్ బ్యాక్‌గా వెనక్కివస్తుంది.

» బ్యాంక్ యాప్ ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా చేసే లావాదేవీలపై అలాగే బీమా, యుటిలిటీ బిల్లులు, ఈ-కామర్స్ కొనుగోళ్లపై 0.5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.

» జొమాటోకు చెందిన ‘డిస్ట్రిక్ట్’‌ ద్వారా సినిమా టికెట్లు కొనుగోలు చేస్తే 25% రూ.100 వరకు తగ్గింపు లభిస్తుంది.

» బ్యాంక్ 1 సంవత్సరం 1 రోజు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది.

» రూ.1,399 విలువైన కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ సహాయం.

» కార్డు పోగొట్టుకున్నప్పుడు రూ.25,000 కార్డ్ లయబిలిటీ కవర్ లభిస్తుంది.

» రూ.2,00,000 వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటుంది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)