Breaking News

ICRA: డిసెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ 6 శాతం

Published on Sat, 02/24/2024 - 06:16

న్యూఢిల్లీ: భారత్‌ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (2023 అక్టోబర్‌–డిసెంబర్‌) 6 శాతానికి తగ్గుతుందని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2023జూలై–సెపె్టంబర్‌)లో 7.6 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. వ్యవసాయం, పరిశ్రమల పనితీరు స్తబ్దుగా ఉన్నట్టు తెలిపింది. పారిశ్రామిక రంగంలో వృద్ధి తగ్గుముఖం పట్టడానికి గతంలో బేస్‌ ప్రభావం అధికంగా ఉండడానికితోడు, అమ్మకాల పరిమాణం తగ్గడాన్ని ప్రస్తావించింది.. భారత ప్రభుత్వం, 25 రాష్ట్రాల వ్యయాలు అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో 0.2 శాతం మేర తగ్గడం జీవీఏ వృద్ధిని వెనక్కి లాగడానికి కారణాల్లో ఒకటిగా పేర్కొంది.

‘‘పారిశ్రామిక రంగంలో అమ్మకాల పరిమాణం తగ్గడం, పెట్టుబడులపైనా కొంత స్తబ్దత, ప్రభుత్వ వ్యయాలు తగ్గడం, రుతుపవనాలు అసాధారణం ఉండడం వంటివి జీడీపీ వృద్ధిని 2023–24లో మూడో త్రైమాసికంలో 6 శాతానికి తగ్గిస్తాయి’’అని వివరించింది. ఇక సేవల రంగానికి సంబంధించి జీవీఏ (స్థూల అదనపు విలువ) మాత్రం 2023–24లో రెండో త్రైమాసికంలో ఉన్న 5.8 శాతం నుంచి మూడో త్రైమాసికంలో 6.5 శాతానికి వృద్ధి చెందుతుందని ఇక్రా అంచనా వేసింది. హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)