Breaking News

ఐటీలో వృద్ధి అంతంతే

Published on Wed, 07/02/2025 - 01:55

న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2–3 శాతం వృద్ధికి (డాలర్‌ మారకంలో) పరిమితం అవుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఐటీ సేవల రంగానికి స్థిరమైన అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. పరిశ్రమలో 60 శాతం ఆదాయం వాటా కలిగిన 15 ప్రముఖ ఐటీ కంపెనీలను విశ్లేషించి ఇక్రా ఈ వివరాలు విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం ఆదాయంలో 2.9 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. అమెరికా టారిఫ్‌ల విధింపుతో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు కీలక మార్కెట్లలో కంపెనీల ఐటీ బడ్జెట్‌లపై ప్రభావం చూపిస్తాయని ఇక్రా తెలిపింది.

ఇటీవలి త్రైమాసికాల్లో కంపెనీల నిర్వహణ ఆదాయం కొంత కోలుకున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెప్పుకోతగ్గ స్థాయిలో పుంజుకోకపోవచ్చని పేర్కొంది. అమెరికా టారిఫ్‌లనే ప్రధానంగా ప్రస్తావించింది. ‘‘భారత ఐటీ సేవల ఆదాయంలో 80–90 శాతం వాటాతో యూఎస్, యూరప్‌ కీలక మార్కెట్లుగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వృద్ధి 2024–25లో మోస్తరుగా మారింది. తుది త్రైమాసికంలో కొంత క్షీణత కనిపించింది. 2025–26 మొదటి త్రైమాసికం అంచనాలపై అప్రమత్తత నెలకొంది. అమెరికా టారిఫ్‌లపై ఏర్పడిన అనిశ్చితులు ఐటీ వ్యయాలను నియంత్రిస్తున్నాయి. ఇది పరిశ్రమ పనితీరుపై ప్రభావం చూపించనుంది’’అని ఇక్రా వివరించింది. 

నియామకాలూ తక్కువే.. 
డిమాండ్‌ మెరుగుపడేంత వరకు ఐటీ రంగంలో నియామకాలు తక్కువగానే ఉంటాయని ఇక్రా అంచనా వేసింది. ఏఐ, జెనరేటివ్‌ ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీలను కంపెనీలు అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో.. నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల అవసరం భవిష్యత్‌ నియామకాలను ప్రభావిం చేస్తుందనిని తెలిపింది. యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత ఐటీ సేవల రంగానికి వచ్చే ప్రయోజనాలను ప్రస్తావించింది. ఇందులో బ్రిటన్‌లో పనిచేసే తాత్కాలిక  బారత ఐటీ ఉద్యోగులకు మూడేళ్ల పాటు సామాజిక భద్రతా ప్రయోజలను అందించే నిబంధన ఉండడాన్ని సానుకూలంగా పేర్కొంది.

Videos

వైఎస్ జగన్ ను కలవొద్దని మామిడి రైతులను కూటమి నేతలు బెదిరిస్తున్నారు

మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: రాంచందర్రావు

ఈనెల 9న చిత్తూరు జిల్లాలో YS జగన్ పర్యటన: పెద్దిరెడ్డి

20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి ఠాక్రే వారసులు

గంటాపై ఫిర్యాదు చేసిన భీమిలి నియోజకవర్గ నేతలు

వల్లభనేని వంశితో అభిమానుల ఫోటోలు

ఏపీలో నరకాసుర పాలన: పేర్ని నాని

మధ్యప్రదేశ్ హైకోర్టులో సైఫ్ అలీఖాను కు షాక్

జమ్మూకశ్మీర్ లో అదుపుతప్పిన అమర్ నాథ్ యాత్రికుల కాన్వాయ్

లుక్స్ మార్చి పిచ్చెక్కిస్తున్న డార్లింగ్..!

Photos

+5

విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌లో చుక్కలు (ఫొటోలు)

+5

ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్‌ సోదరి (ఫోటోలు)

+5

'అఖండ' కోసం తెలుగులో ఎంట్రీ ఇచ్చేసిన నటి హర్షాలీ మల్హోత్రా (ఫోటోలు)

+5

గర్భాలయంలో ఏడడుగుల విగ్రహం.. ఏపీలో ఈ పురాతన ఆలయం గురించి విన్నారా? (చిత్రాలు)

+5

నలుగురు టాప్‌ హీరోయిన్లతో ధనుష్‌ పార్టీ.. ఎందుకో తెలుసా (ఫోటోలు)

+5

చినుకుల్లో డార్జిలింగ్‌ అందాలు.. రా రమ్మని ఆహ్వానించే పచ్చటి కొండ కోనలు!