కొత్త ఫండ్‌ గురూ.. ఇన్వెస్ట్‌ చేసేది ఇక్కడే..

Published on Mon, 12/30/2024 - 08:00

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ (ICICI Prudential) మ్యుచువల్‌ ఫండ్‌ (Mutual Fund) తాజాగా రూరల్‌ ఆపర్చూనిటీస్‌ ఫండ్‌ (rural opportunities fund) పేరిట న్యూ ఫండ్‌ ఆఫర్‌ను (NFO) ప్రకటించింది. ఇది జనవరి 9న ప్రారంభమై 23న ముగుస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల సంబంధిత స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ స్కీము.

దేశ జీడీపీలో గ్రామీణ ప్రాంతాల వాటా గణనీయంగా ఉంటోంది. ప్రభుత్వం కూడా గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఎకానమీని మెరుగుపర్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతోంది. కాబట్టి ఈ థీమ్‌ అనేది వృద్ధి అవకాశాలను అందించవచ్చు. ఈ ఫండ్, వివిధ మార్కెట్‌ క్యాపిటలైజేషన్లవ్యాప్తంగా లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రూరల్‌ థీమ్‌ ఆధారిత సెక్టార్లకు కేటాయింపులను అటూ, ఇటూ మార్చుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుంది.

ఆర్థిక వృద్ధికి దోహదపడే విభాగం అయినందున ఇందులో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు దేశ గ్రామీణ వృద్ధి గాథలో పాలుపంచుకునే అవకాశం లభించగలదని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఈడీ శంకరన్‌ నరేన్‌ తెలిపారు. దీనికి నిఫ్టీ రూరల్‌ ఇండెక్స్‌ ప్రామాణిక సూచీగా ఉంటుంది. 6 నెలల ఫ్రీ–ఫ్లోట్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సగటు ఆధారంగా అతి పెద్ద 75 స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. శంకరన్‌ నరేన్, ప్రియాంక ఖండేల్వాల్‌ ఈ స్కీమును నిర్వహిస్తారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)