రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం
Breaking News
ఐసీఐసీఐ ఏఎంసీ @ రూ. 2,0612,165
Published on Tue, 12/09/2025 - 06:28
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్ ఇష్యూకి రూ. 2,061–2,165 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 12న ప్రారంభమై 16న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 11న షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్(యూకే) 4.89 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 10,602 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది.
ఈ నెల 19న లిస్టింగ్కానున్న కంపెనీ విలువ రూ. 1.07 లక్షల కోట్లుగా నమోదయ్యే వీలుంది. ప్రస్తుతం ఏఎంసీలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐకు 51 శాతం వాటా ఉంది. మిగిలిన 49 శాతం భాగస్వామ్య కంపెనీ ప్రుడెన్షియల్ హోల్డింగ్స్ కలిగి ఉంది. కాగా.. ఇప్పటికే ఈ విభాగంలో నాలుగు సంస్థలు హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ, శ్రీరామ్ ఏఎంసీ, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ దేశీయంగా లిస్టయ్యాయి.
ఈ బాటలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐదో కంపెనీగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో అడుగుపెట్టనుంది. అంతేకాకుండా ఐసీఐసీఐ గ్రూప్ నుంచి ఐదో లిస్టెడ్ కంపెనీగా నమోదుకానుంది. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ స్టాక్ మార్కెట్లలో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. ఐపీవో ద్వారా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ(జేవీ)లో భాగస్వామ్య సంస్థ వాటా విక్రయించినప్పటికీ తాము మెజారిటీ వాటాను కొనసాగించనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొన్న విషయం గమనార్హం!
Tags : 1