Breaking News

మొబైళ్లను 5% జీఎస్‌టీ శ్లాబ్‌లో చేర్చాలి

Published on Wed, 08/20/2025 - 13:15

మొబైల్‌ ఫోన్లు, పరికరాలను, నిత్యావసర ఉత్పత్తుల కోసం ఉద్దేశించిన 5 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లో చేర్చాలని కేంద్రానికి ఇండియా సెల్యూలార్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న 18 శాతం జీఎస్‌టీ తిరోగమన విధానమని పేర్కొంది. నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్‌టీ రేట్లను రెండింటికి తగ్గించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో ఐసీఈఏ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రస్తుతం మొబైల్‌ ఫోన్లనేవి విలాస వస్తువులుగా గాకుండా విద్య, వైద్యం, ఆర్థిక సమ్మిళితత్వం, గవర్నెన్స్‌కి సంబంధించి అత్యవసర డిజిటల్‌ మౌలిక సదుపాయాలకు కీలకంగా మారాయని ఐసీఈఏ చైర్మన్‌ పంకజ్‌ మహీంద్రు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్‌ వ్యవస్థను 500 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా  మొబైల్స్‌ను అయిదు శాతం జీఎస్‌టీలో చేర్చాలని కోరారు.  
జీఎస్‌టీ ప్రవేశపెట్టడానికి ముందు చాలా రాష్ట్రాలు మొబైల్‌ ఫోన్లను నిత్యావసర ఉత్పత్తులుగా గుర్తించి, వాటిపై 5 శాతం వ్యాట్‌ (విలువ ఆధారిత పన్ను) మాత్రమే విధించాయని మహీంద్రూ చెప్పారు.

ఇదీ చదవండి: అల్ట్రాటెక్‌ 200 ఎంటీపీఏ సామర్థ్యం

అయితే, జీఎస్‌టీని ప్రవేశపెట్టాక ముందు 12 శాతం శ్లాబ్‌లో ఉంచి ఆ తర్వాత 2020లో 18 శాతానికి మార్చారని మహీంద్రూ గుర్తు చేశారు. దీనితో అందుబాటు ధరల్లో మొబైల్స్‌ లభ్యతపైనా, అమ్మకాల పరిమాణంపైనా ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. మొబైల్స్‌ వార్షిక వినియోగం 30 కోట్ల యూనిట్ల నుంచి 22 కోట్లకు తగ్గిపోయిందని వివరించారు. కాబట్టి వీటిని అయిదు శాతం శ్లాబ్‌లోకి చేర్చడాన్ని మినహాయింపుగా భావించరాదని, కరెక్షన్‌గా పరిగణించాలని మహీంద్రూ చెప్పారు. 2015 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రూ. 18,900 కోట్లుగా ఉన్న మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.45 లక్షల కోట్లకు చేరింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)