Breaking News

దేశీ ఎయిర్‌లైన్స్‌లో  అవకాశాలపై ఐబీఎస్‌ ఫోకస్‌

Published on Mon, 03/10/2025 - 04:58

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ట్రావెల్‌ పరిశ్రమకు సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్విస్‌ (సాస్‌) సేవలు అందించే ఐబీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ .. భారత ఎయిర్‌లైన్స్‌ రంగంలో, లాయల్టీ ప్రోగ్రామ్స్‌ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతోంది. తాము ప్రస్తుతం భారత్‌లో ఎయిర్‌ కార్గో నిర్వహణ విభాగంలో, అలాగే ఎయిరిండియాకి స్టాఫ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ అందిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ వీకే మాథ్యూస్‌ తెలిపారు. మిగతా పోటీ సంస్థలతో పోలిస్తే తమ ఉత్పత్తులు కాస్త ఖరీదైనవిగానే ఉంటాయి కాబట్టి తగిన భాగస్వామిని ఎంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

 ధరకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే భారత మార్కెట్లో ఐటీని విలువను చేకూర్చేదిగా కాకుండా ఖర్చుగానే పరిగణిస్తారని, కానీ ప్రస్తుతం ఆ ధోరణి క్రమంగా మారుతోందని మాథ్యూస్‌ చెప్పారు. ఇప్పుడు ధరే ప్రాతిపదికగా ఉంటున్నప్పటికీ ఎకానమీ పురోగమించే కొద్దీ విలువకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. మిగతా మార్కెట్లలోలాగా భారత్, చైనా మార్కెట్లలో తాము అంత విజయం సాధించలేకపోయామని అంగీకరించిన మాథ్యూస్‌ భారత మార్కెట్‌కి గణనీయంగా వృద్ధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు వృద్ధి బాటలో కొనసాగుతుందన్నారు. కస్టమర్లతో మెరుగైన సంబంధాలు, అత్యుత్తమ టెక్నాలజీ సిస్టంలు, ట్రావెల్‌ కామర్స్‌ మొదలైనవి పరిశ్రమలో కీలక ట్రెండ్స్‌గా ఉంటున్నాయన్నారు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)