Breaking News

Women's Day 2023: మహిళల కోసం హ్యుందాయ్ స్పెషల్ ఆఫర్స్, ఇవే

Published on Tue, 03/07/2023 - 21:02

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హ్యుందాయ్ కంపెనీ మహిళా కస్టమర్లకోసం ప్రత్యేకమైన ఆఫర్స్ తీసుకువచ్చింది. మార్చి 06 నుంచి 09 వరకు హ్యుందాయ్ డీలర్‌షిప్ లేదా సర్వీస్ సెంటర్‌లో ఈ ఆఫర్స్ పొందవచ్చు.

హ్యుందాయ్ కంపెనీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన వివరాల ప్రకారం, ఫ్రీ వాషింగ్ కూపన్, పిక్-అండ్-డ్రాప్ వంటి సర్వీసులు ఉన్నాయని, అంతే కాకుండా కారుని మెరుగైన పద్ధతిలో ఎలా నిర్వహించాలనే దానిపై కూడా ప్రత్యేక సెషన్‌లు కూడా నిర్వహించనున్నట్లు, మహిళల కోసం బ్రాండ్‌లపై myHyundai యాప్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కంపెనీ అందించే ఈ ఆఫర్స్ కేవలం మార్చి 9 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

(ఇదీ చదవండి: Women’s Day 2023: మహిళల కోసం జావా యెజ్డీ ముందడుగు.. దేశ వ్యాప్తంగా బైక్ రైడింగ్)

ఇదిలా ఉండగా హ్యుందాయ్ కంపెనీ ఇటీవల 2023 హ్యుందాయ్ వెర్నా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కస్టమర్లు డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్  ద్వారా రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది ఈ నెల 21న మార్కెట్లో విడుదలవుతుంది.

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నాకి సంబంధించిన చాలా విషయాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. అయితే ధరల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ దీని ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)