Breaking News

ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఛార్జింగ్‌ సమస్యకు చెక్‌!

Published on Mon, 05/27/2024 - 17:00

వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) కీలక ప్రకటన చేసింది. తమిళనాడు కేంద్రంగా మొత్తం 100 ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.

 భారత్‌లో హ్యుందాయ్‌ మోటార్స్‌ 28 వసంతాలు పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా 180 కిలోవాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌లను చైన్నై అంతటా ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఎంఐఎల్‌ ఎక్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ జే వాంగ్ ర్యూ తెలిపారు.

హ్యుందాయ్ ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’ విజన్‌కు అనుగుణంగా మేం వాహనదారుల సౌకర్యాన్ని మెరుగు పరిచే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాం. కాబట్టే  తమిళనాడు అంతటా 100 ఛార్జింగ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి, ఈవీ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచడానికి, రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు ఈవీలను వినియోగించేలా ప్రోత్సహించేలా ప్రయత్నిస్తున్నట్లు జే వాంగ్‌ ర్యూ వెల్లడించారు.  

ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌తో పాటు, ప్రస్తుతం తమిళనాడులో అందుబాటులో ఉన్న 170 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్‌లు కస్టమర్ సౌలభ్యం కోసం మై హ్యుందాయ్‌ యాప్‌లోని ఈవీ ఛార్జ్‌ విభాగంలో మ్యాప్ చేసింది. తద్వారా ఈవీ వాహనదారులు ఛార్జింగ్‌ పాయింట్లలో తమ వాహనాలకు ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. హ్యుందాయ్‌ ఈవీ వినియోగదారులే కాకుండా ఇతర వాహన యజమానులు ఛార్జింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు అని హ్యుందాయ్‌ స్పష్టం చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)