Breaking News

హ్యుందాయ్‌ లాభం డౌన్‌.. రూ.21 డివిడెండ్‌

Published on Sat, 05/17/2025 - 07:49

న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 4 శాతం నీరసించి రూ. 1,614 కోట్లకు పరిమితమైంది. దేశీ అమ్మకాలు మందగించడం ప్రభావం చూపింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,677 కోట్లు ఆర్జించింది.

వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 21 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 17,671 కోట్ల నుంచి రూ. 17,940 కోట్లకు బలపడింది. ఈ కాలంలో దేశీయంగా 1,53,550 వాహనాలను విక్రయించింది. 2023–24 క్యూ4లో రూ. 1,60,317 యూనిట్ల అమ్మకాలు సాధించింది. అయితే ఎగుమతులు 33,400 యూనిట్ల నుంచి 38,100 వాహనాలకు జంప్‌ చేశాయి.

పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హ్యుందాయ్‌ ఇండియా కన్సాలిడేటెడ్‌ నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 5,640 కోట్లను తాకింది. 2023–24లో రూ. 6,060 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 69,829 కోట్ల నుంచి రూ. 69,193 కోట్లకు స్వల్పంగా తగ్గింది. దేశీ అమ్మకాలు 6,14,721 యూనిట్ల నుంచి 5,98,666 యూనిట్లకు వెనకడుగు వేశాయి. ఎగుమతులు నామమాత్ర వృద్ధితో 1,63,386 యూనిట్లకు చేరాయి. 2030కల్లా 20 ఐసీఈ, 6 ఈవీలతో కలిపి 26 కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఎండీ అన్సూ కిమ్‌ పేర్కొన్నారు.

వీటిలో 8 మోడళ్లు 2027కల్లా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది(2025–26) రూ. 7,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ సీవోవో తరుణ్‌ గార్గ్‌ తెలియజేశారు. వీటిలో 40 శాతాన్ని పుణేలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటుపై వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో హ్యుందాయ్‌ షేరు 1.3 శాతం లాభంతో రూ. 1,860 వద్ద ముగిసింది.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)