Breaking News

హ్యుందాయ్‌ తయారీ కేంద్రంగా భారత్‌

Published on Thu, 02/20/2025 - 19:28

పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికా తదితర వర్ధమాన మార్కెట్లకు ఎగుమతులు చేసేందుకు భారత్‌ను తయారీ హబ్‌గా మార్చుకోనున్నట్లు ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుందాయ్‌ (Hyundai) మోటర్‌ ఇండియా ఎండీ అన్సూ కిమ్‌ తెలిపారు. దేశీయంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వివరించారు.

ఆఫ్రికా, మెక్సికో, లాటిన్‌ అమెరికా మార్కెట్లన్నింటిలోనూ అమ్మకాలు పెరుగుతున్నాయని వివరించారు. రిస్కులను తగ్గించుకునేందుకు ఇతర మార్కెట్లపై కూడా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక లాంటి పొరుగు దేశాలకు కూడా ఎగుమతులు పెంచుకోనున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో హ్యుందాయ్‌ వాహన ఎగుమతులు 43,650 యూనిట్ల నుంచి 40,386 యూనిట్లకు తగ్గాయి. 2024 క్యాలెండర్‌ సంవత్సరంలో హ్యుందాయ్‌ మొత్తం 1,58,686 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ అతి పెద్ద ఎగుమతి మార్కెట్లుగా నిలిచాయి.

పేద విద్యార్థులకు సాయం
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలుస్తోంది. హ్యుందాయ్ హోప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ పేరిట స్కాలర్‌షిప్‌లను ఇస్తోంది. తాజాగా ఆ కంపెనీ మొత్తం రూ.3.38 కోట్ల స్కాలర్‌షిప్‌ను అందించింది. దేశంలని 23 రాష్ట్రాల నుండి దరఖాస్తులు వచ్చాయి. 783 మంది ప్రతిభావంత విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లు అందుకున్నారు. వీరిలో 440 మంది విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్ష, క్టాట్‌కి సిద్ధమవుతున్నారు. 343 మంది విద్యార్థులు ఐఐటీల నుండి వచ్చారు. హ్యుందాయ్‌ ఈ కార్యక్రమాన్ని 2024  ఆగస్టులో ప్రారంభించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)