Breaking News

నిరాశ మిగిల్చిన హ్యుందాయ్‌ మోటార్స్‌ ఐపీఓ!

Published on Tue, 10/22/2024 - 12:57

హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా ఐపీఓ మంగళవారం స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌ అయింది. కొంతకాలంగా మదుపర్లు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ 1.5 శాతం డిస్కౌంట్‌తో మార్కెట్‌లోకి ప్రవేశించింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌ అనుబంధ సంస్థ హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా లిమిటెడ్‌(హెచ్‌ఎంఐఎల్‌) రూ.27,870 కోట్లు సమీకరించేందుకు ఐపీఓ బాట పట్టింది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ అక్టోబర్‌ 17తో ముగిసింది.

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ కోసం హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.1865-1960గా నిర్ణయించింది. కానీ 1.5 శాతం డిస్కౌంట్‌తో రూ.1931కు స్టాక్‌ మార్కెట్‌లో లిస్టవ్వడం గమనార్హం. ఈ ఐపీఓకు సంబంధించి భారీగా లిస్టింగ్‌ గెయిన్స్‌ వస్తాయని ముందుగా భావించారు. కానీ అందుకు భిన్నంగా స్టాక్‌ ఒక శాతం డిస్కౌంట్‌లో లిస్ట్‌ కావడంతో మదుపర్లు కొంత నిరాశ చెందుతున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..

గతంలో లైప్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) ఐపీఓకు వచ్చిన సమయంలో అత్యధికంగా రూ.21 వేలకోట్లు సమీకరించింది. ఇవ్వాళ లిస్టయిన హ్యుందాయ్‌ మోటార్స్‌ లిమిటెడ్‌ ఏకంగా రూ.27,870 కోట్ల సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్‌లో లిస్టయ్యింది. ఇదిలాఉండగా, కేవలం లిస్టింగ్‌ లాభాల కోసమే ఐపీఓకు దరఖాస్తు చేసుకునే వారికి ఇది కొంత నిరాశ కలిగిస్తుంది. కంపెనీ బిజినెస్‌పై అవగాహన ఏర్పరుచుకుని, యాజమాన్యం ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణతో ఉందనే అంశాలను పరిగణించి ఐపీఓకు దరఖాస్తు చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. లిస్టింగ్‌ సమయంలో కొన్ని కారణాల వల్ల లాభాలు రాకపోయినా దీర్ఘకాలంలో మంది రాబడులు సంపాదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)