Breaking News

హ్యుందాయ్‌ క్రెటా ఈవీ వచ్చేస్తోంది!

Published on Tue, 06/18/2024 - 04:28

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను తీసుకొస్తోంది. 2025 జనవరి–మార్చి మధ్య ఈ మోడల్‌ దేశీ రోడ్లపై పరుగులు తీస్తుందని కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్‌తో 550 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో క్రెటా ఈవీ రూపుదిద్దుకుంటోందని సమాచారం. ధర రూ. 22–26 లక్షల మధ్య ఉంటుంది.

 హ్యుందాయ్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్న సంగతి తెలిసిందే. సెబీకి దాఖలు చేసిన పత్రాల ప్రకారం భారత్‌లో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టాలన్నది సంస్థ ప్రణాళిక. వీటిలో మాస్‌ మార్కెట్‌ మోడల్‌తోపాటు హైఎండ్, ప్రీమియం ఈవీలు సైతం ఉన్నాయి. ఈవీ విభాగంలో కంపెనీ ప్రస్తుతం దేశంలో అయానిక్‌ 5, కోనా ఎలక్ట్రిక్‌ విక్రయిస్తోంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 17.5 శాతం వాటా విక్రయించాలన్నది సంస్థ లక్ష్యం.

 తద్వారా రూ.25,000 కోట్లు సమీకరించనుంది.  దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్‌.. బ్యాటరీ ఈవీ, హైబ్రిడ్‌ ఈవీ, ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ ఈవీ, మైల్డ్‌ హైబ్రిడ్‌ ఈవీ, ఫ్యూయల్‌ సెల్‌ ఈవీలను తయారు చేస్తోంది.  ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వ్యాపారం కోసం కంపెనీ గతేడాది తమిళనాడులో రూ.20,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. చెన్నై ప్లాంటును ఈవీలు, ఎస్‌యూవీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)