Breaking News

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు రూ.11 లక్షలకే..

Published on Fri, 07/03/2026 - 13:30

భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో మరింత మంది వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో హ్యుందాయ్ మోటార్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రముఖ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘క్రెటా ఎలక్ట్రిక్’ కోసం బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో బ్యాటరీ ధరను వాహనం ధర నుంచి వేరు చేయడం ద్వారా క్రెటా ఎలక్ట్రిక్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.10.99 లక్షలకు తీసుకొచ్చింది. ఈ కొత్త విధానాన్ని కంపెనీ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలులో అధిక ప్రారంభ వ్యయం ప్రధాన అడ్డంకిగా ఉండేది. కొత్త బాస్‌ మోడల్‌లో వినియోగదారులు కారును తక్కువ ధరకు కొనుగోలు చేసి, బ్యాటరీ కోసం ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ లేదా ఈఎంఐ విధానాన్ని ఎంచుకోవచ్చు. హ్యుందాయ్ తెలిపిన వివరాల ప్రకారం బ్యాటరీ ఈఎంఐ ఖర్చు కిలోమీటరుకు రూ.3.90 నుంచి ప్రారంభమవుతుంది. దీంతో ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం తగ్గి, ఈవీ యాజమాన్యం మరింత అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫీచర్లలోనూ అప్‌డేట్

బాస్‌ మోడల్‌తో పాటు క్రెటా ఎలక్ట్రిక్‌లో కొన్ని కొత్త ఫీచర్లను కూడా హ్యుందాయ్ జోడించింది. అన్ని సంబంధిత వేరియంట్లలో ‘ఇంటిగ్రేటెడ్ సైడ్ ఫుట్ స్టెప్’ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో వాహనంలోకి ఎక్కడం, దిగడం మరింత సులభంగా ఉంటుంది. అలాగే వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని హోమ్ ఛార్జర్ వేరియంట్లలో 7.4 కిలోవాట్ల వాల్‌బాక్స్ ఛార్జర్‌ను ప్రామాణికంగా అందిస్తోంది.

రెండు బ్యాటరీ ప్యాక్‌లు.. 510 కి.మీ వరకు రేంజ్

క్రెటా ఎలక్ట్రిక్‌లో 42 కిలోవాట్లు, 51.4 కిలోవాట్లు అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు కొనసాగుతున్నాయి. పెద్ద బ్యాటరీతో కూడిన లాంగ్-రేంజ్ వేరియంట్‌కు ఒకసారి పూర్తి ఛార్జ్‌తో గరిష్టంగా 510 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ (ARAI సర్టిఫైడ్) లభిస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 39 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. లాంగ్-రేంజ్ వేరియంట్ 0 నుంచి 100 కిమీ వేగాన్ని 7.9 సెకన్లలో అందుకుంటుంది.

ప్రీమియం టెక్నాలజీ ఫీచర్లు

క్రెటా ఎలక్ట్రిక్‌లో వెహికల్-టు-లోడ్ (V2L), హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవల్-2 ADAS, ఐ-పెడల్ సింగిల్ పెడల్ డ్రైవింగ్, డిజిటల్ కీ, యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీ కూడా కంపెనీ అందిస్తోంది.

ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ

దేశంలో ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హ్యుందాయ్ తన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 183 ప్రాంతాల్లో 214 డీసీ ఫాస్ట్ ఛార్జర్లు, మొత్తం 399 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే మైహ్యుందాయ్‌  యాప్‌లోని ఈవీ ఛార్జ్‌ ఫీచర్ ద్వారా దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లను వినియోగదారులు గుర్తించి ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)