Breaking News

హైదరాబాద్‌లో పెరుగుతున్న కొత్త షాపింగ్‌ మాల్స్‌

Published on Sat, 10/11/2025 - 19:06

సాక్షి, సిటీబ్యూరో: ఏటేటా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వస్తువులు, సేవలను విక్రయించే వాణిజ్య స్థలం(రిటైల్‌ స్పేస్‌) పెరుగుతోంది. దీంతో నగరంలో తలసరి రిటైల్‌ స్పేస్‌ 3.6 లక్షల చ.అ.లకు చేరింది. ప్రస్తుతం భాగ్యనగరంలో గ్రేడ్‌–ఏ, బీ షాపింగ్‌ మాల్స్‌ స్టాక్‌ 35.1 లక్షల చ.అ.లుగా ఉండగా.. ఇందులో వేకెన్సీ 1.85 శాతంగా ఉందని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక వెల్లడించింది.  

∙నగరంలో ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో 5.1 లక్షల చ.అ. రిటైల్‌ స్పేస్‌ లీజుకు పోయింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 9.3 శాతం ఎక్కువ. కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు నగరంలో 20.4 లక్షల చ.అ. రిటైల్‌ స్పేస్‌ లీజుకు పోయింది. గ్రేడ్‌–ఏ మాల్స్‌ సరఫరా పరిమితంగా కారణంగా ఈ త్రైమాసికంలో ఎక్కువ లీజులు హైస్ట్రీట్‌ ప్రాంతాలలో జరిగాయి.

మొత్తం లీజులలో 42 శాతం కొంపల్లి, నల్లగండ్ల, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వంటి సబర్బన్‌ కారిడార్లలో జరిగాయి. బంజారాహిల్స్, పంజగుట్ట, హిమాయత్‌నగర్‌ వంటి కోర్‌ సిటీలో 32 శాతం, సుచిత్ర, బోడుప్పల్‌ వంటి శివార్లలో 26 శాతం లీజులు జరిగాయి. ఫ్యాషన్, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్, యాక్ససరీస్‌ కేటగిరీల్లో రిటైల్‌ స్పేస్‌ లీజులు అధికంగా జరిగాయి. లైఫ్‌ స్టయిల్‌ విభాగం 16 శాతం, ఫరీ్నచర్‌ 10 శాతం, హెల్త్‌ కేటగిరీలో 10 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మొత్తం లీజుల్లో దేశీయ బ్రాండ్లు 88 శాతం, అంతర్జాతీయ బ్రాండ్లు 12 శాతం వాటాలున్నాయి.

కొత్త మాల్స్‌.. 
ప్రస్తుతం నగరంలో 28 లక్షల చ.అ. కొత్త షాపింగ్‌ మాల్స్‌ నిర్మాణంలో ఉన్నాయి. ఇవి 2027 నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది నాల్గో త్రైమాసికం నాటికి 17 లక్షల చ.అ. గ్రేడ్‌–ఏ మాల్స్‌ స్థలం డెలివరీ అవుతుంది. కొంపల్లి, శంషాబాద్‌ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో నివాసితులు వినోద అవసరాలను తీర్చేందుకు ఈ మాల్స్, రిటైల్‌ స్పేస్‌ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కొంపల్లి, ఎంజీ రోడ్, దిల్‌సుఖ్‌నగర్, బంజారాహిల్స్, అబిడ్స్, హిమాయత్‌నగర్, అమీర్‌పేట, మాదాపూర్, నల్లగండ్ల, హబ్సిగూడ, కోకాపేట, మణికొండ వంటి ప్రాంతాలలో రిటైల్‌ స్పేస్‌ అద్దె నెలకు చ.అ.కు రూ.135–250 వరకు ఉన్నాయి.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)