Breaking News

ఆ రంగంలో హైదరాబాద్ టాప్: ఆ తరువాతే అన్నీ..

Published on Tue, 11/19/2024 - 18:54

భారతదేశంలో విభిన్న రంగాల్లో (ఆర్థిక పరిస్థితులు, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, పాలన) వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాల జాబితాను నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్, ఆర్థిక రంగంలో బెంగళూరు, పాలన, మౌలిక సదుపాయాలలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నాయి.

➤రియల్ ఎస్టేట్ విభాగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత బెంగళూరు, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై ఉన్నాయి. హైదరాబాద్లో అపార్ట్మెంట్లకు, ఇతర స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. గతంలో పోలిస్తే ఇక్కడ ధరలు కూడా 11 శాతం పెరిగాయి.

➤ఆర్థిక పరిస్థితుల పరంగా బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ ఉన్నాయి. అత్యధిక శ్రామిక శక్తి కలిగిన నగరాల్లో బెంగళూరు టాప్‌లో ఉంది. బెంగళూరులో వ్యాపార కార్యకలాపాలు అధికంగా జరుగుతాయి.

➤భౌతిక మౌలిక సదుపాయాల విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ రెండో స్థానంలోనూ.. ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై ఉన్నాయి. భారతదేశపు అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ కలిగి ఢిల్లీ మెట్రో రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 68 లక్షల కంటే ఎక్కువే.

➤ఇక చివరిగా పాలన విషయానికి వస్తే.. ఈ విభాగంలో కూడా ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై ఉన్నాయి. ఢిల్లీ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్ వంటి ఢిల్లీ ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, మెరుగైన పబ్లిక్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని నివేదికలో వెల్లడైంది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)