Breaking News

9 టూ 5 జాబ్‌ చేస్తూ రూ.65 లక్షల మినీ కూపర్

Published on Sun, 12/07/2025 - 17:21

హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళా టెక్కీ తను చేస్తున్న ఉద్యోగం ద్వారా ఆమె కలల కారు ‘మినీ కూపర్ ఎస్’ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. నిహారిక నాయక్ అనే మహిళ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఐకానిక్ వాహనాన్ని డెలివరీ అందుకుంటున్న క్షణాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన 16 ఏళ్ల కెరియర్‌ ప్రయాణం, మంచి జీతంతో ఈ కారును కొనుగోలు చేశానని చెప్పుకొచ్చారు.

39 ఏళ్ల నిహారిక నాయక్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక మిడ్ సైజ్ టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థలో క్వాలిటీ అస్యూరెన్స్ హెడ్‌గా 9 టూ 5 జాబ్‌ పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఆమె 2008లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ‘నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఆర్థిక మాంద్యం వల్ల ఐటీ ఉద్యోగాలపై స్పష్టత లేదు. ఐటీ రంగం అస్థిరంగా ఉంది’ అని నిహారిక గుర్తు చేసుకున్నారు. ‘కానీ నేను ఆ రంగాన్ని ఎంచుకున్నాను. 16 సంవత్సరాలుగా దానిలోనే ఉన్నాను’ అని చెప్పారు.

కెరియర్‌లో వృత్తిపరమైన ఎదుగుదల కోసం ఉద్యోగాలు మారడం ఆమెకు లాభదాయకమైన నిర్ణయంగా అనిపించిందని చెప్పారు. మేనేజర్‌ స్థానంలో ఉన్న ఆమె ప్రస్తుతం అధిక జీతం పొందుతున్నట్లు చెప్పారు. గత ఆరేళ్లుగా ఒకే టెక్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తున్న ఆమె తన జీతం ఎంతో సరిగ్గా చెప్పనప్పటికీ సంవత్సరానికి రూ.45 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు ధ్రువీకరించారు. అయితే మొదట్లో ఐటీ ఉద్యోగంలో చాలా తక్కువగా వేలల్లోనే జీతం ఉండేదన్నారు. ఒకే రంగాన్ని నమ్ముకొని అందుకు నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే జీతం అదే పెరుగుతుందన్నారు. నిహారిక నాయక్ మినీ కూపర్ ఎస్ ఆన్ రోడ్ ధర హైదరాబాద్‌లో రూ.65 లక్షలుగా ఉంది.

ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో నరాల సమస్య

Videos

Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జానియర్ ఎన్టీఆర్

Maoist Leader: మావోలకు భారీ ఎదురుదెబ్బ 3 కోట్లు రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సరెండర్

ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశాం: బొత్స సత్యనారాయణ

ఛీ.. ఛీ.. మీరు రాష్ట్రానికి పట్టిన. రామ్మోహన్ నాయుడు, లోకేష్‌పై రెచ్చిపోయిన KA పాల్

Kethireddy Pedda Reddy: అంతా మీ ఇష్టమా! తాడిపత్రి మీ అడ్డా కాదు

ఇండియాలో స్టార్ లింక్ సబ్ స్క్రిప్షన్ ధరలు ఇవే!

వెంటనే ఆపేయండి.. మెడికల్ కాలేజీల జోలికి పోవద్దు

Tadepalli : పోలీసుల ఓవర్ యాక్షన్ విద్యార్థి నేతలను లారీ ఎక్కించి..!

Machilipatnam: కూటమి నాయకుల మధ్య వాజ్‌పేయి విగ్రహం చిచ్చు

Photos

+5

చేతి వేళ్లన్నంటికీ రింగ్స్.. మృణాల్ ఠాకుర్ ఫ్యాషన్ (ఫొటోలు)

+5

సూర్య కొత్త సినిమా లాంచ్.. హీరోయిన్‌గా నజ్రియా (ఫొటోలు)

+5

అట్టహాసంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం (చిత్రాలు)

+5

Chiranjeevi : మేనేజర్ కుమార్తె బారసాల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు (ఫొటోలు)

+5

నేటి తరానికి స్పూర్తి.. మన 'ప్రగతి' విజయం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఈ కాళీ మాత ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

మడత మంచంపై పడుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్ ట్రిప్‌లో 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ రమ్య మోక్ష లేటేస్ట్ లుక్స్.. ఫోటోలు