Breaking News

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌.. రిజిస్ట్రేషన్లు రయ్‌.. రయ్‌..

Published on Tue, 02/18/2025 - 18:53

హైదరాబాద్‌లో ఖరీదైన ఇళ్ల అమ్మకాలు నిరంతరం పెరుగుతున్నాయి. మొత్తం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ  రిజిస్ట్రేషన్ అయిన ఇళ్ల మొత్తం విలువ గత సంవత్సరంతో పోలిస్తే 5 శాతం పెరిగింది. అయితే అధిక సరఫరా కారణంగా అపార్ట్‌మెంట్‌ అ‍మ్మకాల్లో మాత్రం మార్కెట్ ఫ్లాట్ వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 5,444 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ మేరకు రియల్‌ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఓ నివేదిక విడుదల చేసింది.

హైదరాబాద్ నివాస మార్కెట్ ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి అనే నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రాథమిక, ద్వితీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ల నుండి కూడా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి.  "రిజిస్ట్రేషన్లలో రూ. 50 లక్షల లోపు ప్రాపర్టీలు ఆధిపత్యం చెలాయించాయి. కానీ ప్రీమియమైజేషన్ వైపు బలమైన మార్పు కనిపించింది. 2025 జనవరిలో రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల ధర 12% పెరిగింది. ఇది అధిక విలువ కలిగిన ప్రాపర్టీలకు పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది" అని నైట్ ఫ్రాంక్ పేర్కొంది.

హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్‌ అయిన ప్రాపర్టీలలో ఎక్కువ భాగం 1,000 నుండి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవే. రిజిస్ట్రేషన్లన్నింటిలో వీటి  వాటా 69%.  2024 జనవరిలో రిజిస్ట్రేషన్‌ అయిన 13%తో పోలిస్తే 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న యూనిట్లు మొత్తం రిజిస్ట్రేషన్లలో 14% వాటా కలిగి ఉన్నాయని నైట్ ఫ్రాంక్ వివరించింది.

మేడ్చల్-మల్కాజ్‌గిరి టాప్‌
నైట్‌ ఫ్రాంక్ ప్రకారం..  జిల్లా స్థాయిలో చూస్తే 45% ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లతో మేడ్చల్-మల్కాజ్‌గిరి అగ్ర స్థానంలో ఉండగా 41% రిజిస్ట్రేషన్లతో రంగారెడ్డి జిల్లా ఆ తర్వాత స్థానంలో ఉంది.  హైదరాబాద్ జిల్లా మొత్తం రిజిస్ట్రేషన్లలో మిగిలిన 14% వాటాను అందించింది. అమ్ముడుపోయిన నివాస ఆస్తుల సగటు ధర  2025 జనవరిలో 3% పెరుగుదలను చూసింది. జిల్లాలలో మేడ్చల్-మల్కాజ్‌గిరి అత్యధికంగా 11% పెరుగుదలను చూసిందని రిజిస్ట్రేషన్ డేటా చెబుతోంది.

గృహ కొనుగోలుదారులు పెద్ద పరిమాణంలో, ఉన్నతమైన సౌకర్యాలను అందించే ఖరీదైన ఆస్తులను కూడా కొనుగోలు చేశారు. 2025 జనవరిలో జరిగిన మొదటి ఐదు డీల్స్‌లో 3,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ, రూ. 5.5 కోట్ల కంటే పైబడి విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ లావాదేవీలలో మూడు పశ్చిమ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్‌ కాగా, రెండు రిజిస్ట్రేషన్‌లు సెంట్రల్ హైదరాబాద్‌లో జరిగాయి.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)