Breaking News

హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్‌‌ పతనం

Published on Sat, 03/29/2025 - 16:15

రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ ప్రతికూల విధానాలు, ఆకాశాన్నంటిన ప్రాపర్టీ ధరలు.. కారణాలేవైనా.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం పల్టీలు కొడుతూ పతనమైపోతోంది. రెండేళ్ల క్రితం ఎన్నికలతో మొదలైన స్థిరాస్తి రంగం మందగమనం.. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో గ్రేటర్‌లో గృహ విక్రయాలు, లాంచింగ్స్‌ భారీగా తగ్గాయి. దేశంలోనే ఇళ్ల అమ్మకాలు, లాంచింగ్స్‌లో అత్యధిక క్షీణత మన నగరంలోనే ఉండటం గమనార్హం. - సాక్షి, సిటీబ్యూరో  

హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో (క్యూ1) 10,100 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2024 క్యూ1లో 19,660 సేల్‌ అయ్యాయి. ఏడాది కాలంలో విక్రయాలలో 49 శాతం తగ్గుదల నమోదయిందని అనరాక్‌ గ్రూప్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. అలాగే నగరంలో 2025 క్యూ1లో కొత్తగా 10,275 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. అదే 2024 క్యూ1లో 22,960 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో లాంచింగ్స్‌ 55 శాతం తగ్గాయని పేర్కొంది. అయితే ఆశ్చర్యకరంగా నగరంలో కొత్తగా ప్రారంభమైన ఇళ్లలో లగ్జరీ గృహాలదే ఆధిపత్యం. గ్రేటర్‌లో కొత్త ఇళ్ల నిర్మాణాలలో రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ ఇళ్ల వాటా 70 శాతం కంటే ఎక్కువగా ఉంది.

 

ఇన్వెంటరీ 5 లక్షలపైనే.. 
ఏడు నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) కాస్త తగ్గాయి. 2024 క్యూ1లో 5,80,890 యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. 2025 క్యూ1 నాటికి 5,59,810కు క్షీణించాయి. అంటే ఏడాది కాలంతో పోలిస్తే ఇన్వెంటరీ 4 శాతం తగ్గింది. స్థిరమైన ఆర్థిక పరిస్థితి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణ నియంత్రణ కారణంగా దేశంలో గృహాల ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. ఏడాది కాలంలో ప్రాపర్టీ ధరలు మాత్రం 17 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా ఎన్‌సీఆర్‌లో 34 శాతం, బెంగళూరులో 20 శాతం వృద్ధి చెందాయి.

దేశంలోనూ సేమ్‌.. 
దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోనూ స్థిరాస్తి రంగం తిరోగమనంలోనే ఉంది. ఈ ఏడాది క్యూ1లో ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 28 శాతం, లాంచింగ్స్‌ 10 శాతం క్షీణించాయి. 2025 క్యూ1లో 93,280 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే గతేడాది క్యూ1లో 1,30,170 ఇళ్లు విక్రయమయ్యాయి. ఇదే సమయంలో 7 నగరాల్లో 2025 క్యూ1లో 1,00,020 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. 2024లో 1,10,865 గృహాలు ప్రారంభమయ్యాయి. అంటే ఏడాదిలో 10 శాతం లాంచింగ్స్‌ క్షీణించాయి.

లగ్జరీదే హవా.. 
లాంచింగ్స్‌లో లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాలే అత్యధికం. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ తరహా ఇళ్ల వాటా 42 శాతం ఉన్నాయి. ఆ తర్వాత రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉండే ప్రీమియం యూనిట్ల వాటా 27 శాతం, రూ.40–80 లక్షల ధర ఉండే అఫర్డబుల్‌ హౌసింగ్స్‌ వాటా 12 శాతంగా ఉన్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)