Breaking News

హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్‌లో జోరు

Published on Sat, 06/28/2025 - 16:00

హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్‌ ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పడు ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 23 శాతం అధికంగా 32 లక్షల చదరపు అడుగులుగా (ఎస్‌ఎఫ్‌టీ) నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లీజింగ్‌ పరిమాణం 26 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లోనూ స్థూల ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 11 శాతం పెరిగి 178 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు కొలియర్స్‌ ఇండియా ఒక నివేదిక రూపంలో వెల్లడించింది.

అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ కార్పొరేట్ల నుంచి లీజింగ్‌కు మంచి డిమాండ్‌ కనిపించినట్టు తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఏడు నగరాల్లో స్థూల ఆఫీసు లీజింగ్‌ 161 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. హైదరాబాద్‌ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, పుణెలో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరగ్గా.. ఒక్క ముంబైలో మా త్రం తగ్గింది. ఈ గణాంకాల్లో లీజు పునరుద్ధరణ లు, ముందస్తు హామీలు, ఆసక్తి వ్యక్తీకరణలకు సంబంధించి డేటా లేదని కొలియర్స్‌ స్పష్టం చేసింది.  

  • నగరాల వారీ లీజింగ్‌.. 
        బెంగళూరులో 48 లక్షల ఎస్‌ఎఫ్‌టీ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ లావాదేవీలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోనూ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 48 లక్షల ఎస్‌ఎఫ్‌టీగానే ఉండడం గమనించొచ్చు.

  • చెన్నైలో క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే 30 శాతం అధికంగా 26 లక్షల ఎస్‌ఎఫ్‌టీ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ నమోదైంది.

  • ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో ఆఫీస్‌ వసతుల లీజింగ్‌ 16 శాతం వృద్ధితో 22 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.

  • కోల్‌కతాలో లీజింగ్‌ 3 లక్షల నుంచి 6 లక్షల చదరపు అడుగులకు దూసుకెళ్లింది.

  • పుణె నగరంలో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 60 శాతం పెరిగి రూ.16 లక్షల చదరపు అడుగులకు చేరింది.

  • ముంబైలో మాత్రం ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 28 లక్షల ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్‌ 35 లక్షల చదరపు అడుగులతో పోల్చి చూసినప్పుడు 20 శాతం తగ్గింది.

  • ఈ ఏడు పట్టణాల్లో కలిపి 175 లక్షల ఎస్‌ఎఫ్‌టీ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌కు గాను 135 లక్షల ఎస్‌ఎఫ్‌టీని కార్పొరేట్లు తీసుకున్నారు. 43 లక్షల ఎస్‌ఎఫ్‌టీని కోవర్కింగ్‌ ఆపరేటర్లు తీసుకోవడం గమనార్హం.  

ఈ ఏడాది ప్రోత్సాహకరమే 
‘‘భారత ఆఫీస్‌ మార్కెట్‌ 2025లోనూ వృద్ధి దశలో ఉంది. గత రెండు సంవత్సరాలుగా నమోదవుతున్న సానుకూల ధోరణికి అనుగుణంగానే ఉంది. స్థిరమైన సరఫరా, లీజుదారుల పరంగా వైవిధ్యం మద్దతుతో 2025 సంవత్సరం వాణిజ్య రియల్‌ ఎసేŠట్‌ట్‌ మార్కెట్‌కు ప్రోత్సాహకరంగా ఉండనుంది. మొత్తంమీద ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ ఈ ఏడాది చివరికి 65–70 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరుకోవచ్చు’’అని కొలియర్స్‌ ఇండియా ఆఫీస్‌ సర్వీసెస్‌ ఎండీ అర్పిత్‌ మల్హోత్రా తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)