Breaking News

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు షాకిచ్చిన జూన్‌! ఎలాగంటే..

Published on Sat, 07/15/2023 - 09:50

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉండగా.. రియల్టీ రంగంలో స్తబ్దత నెలకొంది. ఏ ప్రభుత్వం వస్తుందో, అభివృద్ధి పనులు ఎలా ఉంటాయో, ధరలు తగ్గుతాయేమో అనే రకరకాల కారణాలతో స్థిరాస్తి విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.

మే నెలతో పోలిస్తే జూన్‌లో గ్రేటర్‌లో రిజిస్ట్రేషన్లు, వాటి విలువలు క్షీణించడమే ఇందుకు ఉదాహరణ. మేలో రూ.2,994 కోట్ల విలువ చేసే 5,877 అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్స్‌ జరగగా.. జూన్‌ నాటికి రూ.2,898 కోట్ల విలువైన 5,566 యూనిట్ల రిజిస్ట్రేషన్స్‌ జరిగాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. 

  • గతేడాది జూన్‌లో జరిగిన 5,411 యూనిట్లతో పోలిస్తే గత నెలలో రిజిస్ట్రేషన్స్‌లో 3 శాతం వృద్ధి నమోదయింది. అలాగే విలువల పరంగా చూస్తే 2022 జూన్‌లో రూ.2,842 కోట్లతో పోలిస్తే గత నెలలో 2 శాతం పెరుగుదల కనిపించింది. గత నెలలోని రిజిస్ట్రేషన్స్‌లో 52 శాతం యూనిట్లు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాలే. అలాగే రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ గృహాల వాటా 9 శాతంగా ఉంది. 68 శాతం ఫ్లాట్లు 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణం ఉన్న యూనిట్లే. 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 11 శాతంగా ఉంది. 
  • రిజిస్ట్రేషన్స్‌లో మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా హవా కొనసాగుతుంది. జూన్‌లో జరిగిన రిజిస్ట్రేషన్స్‌లో ఈ జిల్లా వాటా 46 శాతం కాగా.. రంగారెడ్డి 38 శాతం, హైదరాబాద్‌ 16 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 

ఈ ఏడాది నెల వారీగా రిజిస్ట్రేషన్స్‌ (రూ.కోట్లలో) 

నెల రిజిస్ట్రేషన్లు విలువ
జనవరి 5,454 2,650 
ఫిబ్రవరి 5,725 2,987 
మార్చి 6,959   3,602 
ఏప్రిల్‌  4,494  2,286 
మే              5,877    2,994
జూన్‌      5,566    2,898

సోమాజిగూడలో రూ.5.09 కోట్లు
సోమాజిగూడ ఖరీదైన నివాసాలకు కేంద్రంగా మారింది. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో టాప్‌–5 లావాదేవీలలో నాలుగు ఈ ప్రాంతంలోనే జరగడం గమనార్హం. రూ.5.09 కోట్ల మార్కెట్‌ విలువ గల 3,500 చ.అ.ల లోపు ఉన్న రెండు అపార్ట్‌మెంట్లు, రూ.4.22 కోట్ల వ్యాల్యూ ఉండే మరొక రెండు యూనిట్ల రిజిస్ట్రేషన్స్‌ జరిగాయి. అలాగే నార్సింగిలో రూ.5 కోట్ల మార్కెట్‌ విలువ గల ఓ ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ జరిగిందని నైట్‌ఫ్రాంక్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.

ఇదీ చదవండి: ఇల్లు అద్దెకివ్వడానికి ఇంటర్వ్యూ.. దిమ్మతిరిగిపోయే ప్రశ్నలతో చుక్కలు చూపించిన ఓనర్‌! 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)